బంగాల్, ఆలిపుర్ద్వార్లో 101 ఏళ్ల బామ్మ కరోనాను జయించింది. కరోనా సోకిందనగానే కుంగిపోయి, వణికిపోతున్న యువతకు ఆదర్శంగా నిలిచేలా... మహమ్మారితో ధైర్యంగా పోరాడి గెలిచింది.
ఆలిపుర్ద్వార్, కల్చినీ బ్లాక్, జైగావ్కు చెందిన ఆమె, ఆగస్టు 17న శ్వాస సంబంధిత సమస్యతో.. జిల్లా ఆసుపత్రిలో చేరింది. అక్కడ వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేల్చారు. దీంతో బామ్మను కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. సీసీయూ వార్డులో చికిత్స అందించారు. మొదట రెండు రోజులు ఆమె పరిస్థితి విషమంగా ఉండేది. కానీ, మూడో రోజు నుంచి చికిత్సకు బామ్మ మెరుగ్గా స్పందించిందని వైద్యులు వెల్లడించారు.