రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దర్శనానికి సంబంధించిన నిబంధనలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కీలక ప్రకటన చేశారు.
ఆలయంలోకి రోజూ గరిష్ఠంగా వెయ్యి మంది భక్తులకు అనుమతి ఇస్తామని విజయన్ స్పష్టం చేశారు. సెలవులు, ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున 5 వేలమందికి అనుమతినిచ్చే అవకాశం ఉందని తెలిపారు.
కరోనా నేపథ్యంలో మండల-మకర సంక్రాంతి సీజన్ సమయంలో భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు విజయన్ తెలిపారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నెగటివ్ ధ్రువీకరణ పత్రాలు వెంటతెచ్చుకోవాలని.. విధుల్లో ఉన్న అధికారులకు వాటిని సమర్పించాలని స్పష్టం చేశారు. యాత్రకు 24 గంటల ముందు పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కరోనా సోకితే.. వారి కోసం చికిత్స సదుపాయాలు కల్పిస్తామన్నారు.
ఇదీ చూడండి:శనివారం నుంచి భక్తులకు శబరిమల దర్శనం