తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బలపరీక్షలో మా విజయం తథ్యం' - Siddaramaiah

విశ్వాస పరీక్షలో 100 శాతం తన బలాన్ని నిరూపించుకుంటానన్నారు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప. సోమవారం సభలో మొట్టమొదటగా ఆర్థికబిల్లును ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

'వందశాతం నా బలాన్ని నిరూపించుకుంటా'

By

Published : Jul 28, 2019, 3:49 PM IST

బల పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. సభలో నూటికి నూరు శాతం తన బలాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్​-జేడీఎస్​ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక బిల్లుకు ఎలాంటి మార్పులు లేకుండా సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఆర్థిక బిల్లు అత్యవసరంగా సభామోదం పొందాల్సిన అవసరముందన్నారు యడ్డీ. లేని పక్షంలో జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వానికి కష్టంగా మారుతుందన్నారు.
14 నెలల కాంగ్రెస్​-జేడీఎస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయింది. అనంతరం గత శుక్రవారమే కన్నడ పీఠాన్ని నాలుగోసారి అధిష్టించారు యడియూరప్ప. సోమవారం కన్నడ విధానసౌధలో బల నిరూపణ చేసుకోనున్నారు యడ్డీ.

స్పీకర్​ నిర్ణయాన్ని స్వాగతించిన సిద్ధరామయ్య

14 మంది రెబల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్​ నిర్ణయాన్ని స్వాగతించారు కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు సిద్ధరామయ్య. స్పీకర్‌ నిర్ణయం అవకాశవాద రాజకీయాలకు గొడ్డలిపెట్టు లాంటిదని, ప్రజాస్వామ్యానికి నిజమైన విజయమని పేర్కొన్నారు.

" ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారం శాశ్వతం కాదు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలే భావితరాలకు ఆదర్శం"
-సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్ణాటక​ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details