మహారాష్ట్రపై కొవిడ్-19 వైరస్ విరుచుకుపడుతోంది. ఇక్కడ కరోనా కేసుల సంఖ్య 1018కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 48 మంది మరణించారు.
సగం కంటే ఎక్కువ బాధితులు ముంబయిలోనే ఉన్నారు. ఈ రాజధాని నగరంలో ఇవాళ ఒక్కరోజే 100కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మరణించారు. ముంబయిలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఈ నగరంలో బాధితుల సంఖ్య 590గా ఉంది.
24 గంటల్లోనే 500 +..
భారత్లో కరోనా కేసులు 5 వేలకు చేరువయ్యాయి. ఇప్పటివరకు 4 వేల 789 మందికి వైరస్ సోకినట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మరణాల సంఖ్య 124కు చేరింది. మొత్తం 352 మంది కోలుకోగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,312గా ఉంది.
గడిచిన 24 గంటల్లో 508 కొవిడ్ కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి.
తమిళనాడు 621, దిల్లీ 576 మంది బాధితులతో కేసుల పరంగా మహారాష్ట్ర తర్వాత వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.
దేశంలో 124కు చేరిన మరణాలు