తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏకు వ్యతిరేకంగా విశ్రాంత బ్యూరోక్రాట్ల లేఖ

సీఏఏ, ఎన్​పీఆర్​లను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వంద మంది విశ్రాంత బ్యూరోక్రాట్లు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. వాటి వల్ల దేశానికి ఏ ఉపయోగమూ లేదని లేఖలో పేర్కొన్నారు.

former bureaucrats letter
సీఏఏకు వ్యతిరేకంగా విశ్రాంత బ్యూరోక్రాట్ల లేఖ

By

Published : Jan 10, 2020, 5:20 AM IST

Updated : Jan 10, 2020, 8:05 AM IST

వివాదాస్పద పౌరచట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​)లను వ్యతిరేకిస్తున్న వారి జాబితాలో కొందరు విశ్రాంత బ్యూరోక్రాట్లు చేశారు. సీఏఏ, ఎన్​పీఆర్​ల రాజ్యాంగ చెల్లుబాటుపై వందమంది విశ్రాంత బ్యూరోక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ రాసిన వారిలో దిల్లీ మాజీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌, కేబినెట్‌ మాజీ కార్యదర్శి కేఎమ్​ చంద్రశేఖర్‌, సమాచార హక్కుచట్టం మాజీ ప్రధాన కమిషనర్‌ నజత్‌హబీబుల్లా తదితరులు ఉన్నారు.

దేశానికి ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీ అవసరం లేదని, వాటితో వృథా ప్రయాస తప్ప మరొకటి కాదన్నారు. వాటివల్ల ఎంతో మందికి ఇబ్బందులే తప్ప ప్రయోజనం ఉండదని విశ్రాంత బ్యూరోక్రాట్లు అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం.. రోడ్లపై ప్రజలతో ఘర్షణ పడే పరిస్థితులు తెచ్చుకోవద్దన్నారు. సమాఖ్య విధానం కలిగిన భారత్‌లో ఎంతో కీలకంగా భావించే కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతిష్టంభనకు వాంఛనీయం కాదన్నారు. విదేశీ చట్ట సవరణ, డిటెన్షన్‌ క్యాంపులు, పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని విశ్రాంత బ్యూరోక్రాట్లు తమ లేఖలో ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: బంగాల్​: సీఐడీ వాహనాలను పేల్చేసిన దుండగులు

Last Updated : Jan 10, 2020, 8:05 AM IST

ABOUT THE AUTHOR

...view details