హరియాణాలో ఓ బాలచోరుడు కలకలం రేపాడు. పట్టుమని పదేళ్లు నిండకుండానే ఓ జాతీయ బ్యాంకులోకి చొరబడి రూ. 20 లక్షలు కాజేశాడు.
దర్జాగా స్కెచ్
హరియాణాలో ఓ బాలచోరుడు కలకలం రేపాడు. పట్టుమని పదేళ్లు నిండకుండానే ఓ జాతీయ బ్యాంకులోకి చొరబడి రూ. 20 లక్షలు కాజేశాడు.
దర్జాగా స్కెచ్
జింద్ జిల్లా, హుడా మార్కెట్లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించాడు ఓ పదేళ్ల బాలుడు. టోపీ, మాస్కు ధరించి క్యాష్ కౌంటర్ పక్కన ఏర్పాటు చేసిన ఓ కుర్చీలో కూర్చొని చోరీకి స్కెచ్ వేశాడు. సరాసరి క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న రూ. 5 లక్షల కట్టలను చూశాడు. కూడా తెచ్చుకున్న సంచిలో ఓ నాలుగు కట్టలు వేసుకున్నాడు. ఎవ్వరికీ ఏమాత్రం అనుమానం రాకుండా నిదానంగా అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆ సమయంలో చోరీ జరిగనట్టు ఎవరికీ ఇసుమంతైనా అనుమానం రాలేదు. కానీ, సాయంత్రం లెక్కల్లో తేడా కొట్టేసరికి.. సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు సిబ్బంది. పదేళ్ల బాలుడు ఎంతో చాకచక్యంగా చోరీకి పాల్పడిన దృశ్యాలు చూసి ఖంగు తిన్నారు. ప్రస్తుతం, బాలుడు సహా ఈ చోరీతో సంబంధమున్న మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి