జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భారత సైన్యం బిజీబిజీగా గడుపుతోంది. గడిచిన 5 రోజుల్లో 4 ఆపరేషన్లు జరపగా.. 10మంది ముష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ఈ వివరాలను జమ్ముకశ్మీర్ డీజీపీ డీ సింగ్ వెల్లడించారు.
ఈ ఏడాది మొత్తం మీద 75 ఆపరేషన్లు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు డీ సింగ్. 180మంది ఉగ్రవాదులను సైన్యం హతమార్చిందని స్పష్టం చేశారు. 138 ముష్కరులతో పాటు వారికి సంబంధం ఉన్న వారిని కూడా అరెస్టు చేసినట్టు వివరించారు. ఇవన్నీ రికార్డులని వెల్లడించారు.
శ్రీనగర్ ఎన్కౌంటర్...
శ్రీనగర్‌లోని పాత బార్జుల్లా ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మిలిటెంట్లను సైన్యం మట్టుబెట్టింది. వీరిలో ఒకడు లష్కరే తోయీబా ఉగ్రసంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా అని అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన సైఫుల్లాకు ఇప్పటివరకు మూడు ఉగ్రదాడుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్నట్టు వివరించారు.
ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి భద్రతా బలగాలు. జవాన్లు చూసిన అనంతరం వారిపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఇదీ చూడండి:-మంచి చెప్పినా వినని ముగ్గురు ముష్కరులు హతం