కర్ణాటక మంత్రివర్గాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప నేడు విస్తరించనున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి భాజపాలో చేరి గత డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన వారిలో 10 మందికి ఈసారి అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా అనుకున్నట్లుగా 13 మంది కాకుండా 10 మంది మాత్రమే మంత్రులుగా ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు యడియూరప్ప.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం.. 10 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిపారు.
"భాజపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్య నేతల సూచన మేరకు 10 మంది మాత్రమే రేపు ప్రమాణం చేస్తారు. త్వరలోనే దిల్లీ వెళ్లి అధిష్ఠానాన్ని కలుస్తాను. మిగతా వారిని కేబినెట్లోకి తీసుకునే అంశంపై చర్చిస్తా. మంత్రివర్గంలోకి ఉమేశ్ కట్టిని తీసుకునే అంశంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాం.. కానీ ప్రస్తుత విస్తరణలో అది సాధ్యం కాదు. ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తాం. "
- యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి
ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ నుంచి వచ్చి గెలుపొందిన 11 మందిలో ఎమ్మెల్యే మహేశ్ కుమతల్లి ఒక్కడినే పక్కనపెడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి. ఆయన విషయంపై అధిష్ఠానంతో మాట్లాడతానని చెప్పారు.
ఉదయం 10:30కు ప్రమాణం..