తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరి నిర్లక్ష్యం- కుటుంబంలో 10 మందికి కరోనా - covid 19 in harthras

ఉత్తర్​ప్రదేశ్​లో ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. వీరిలో నలుగురు చిన్నారులు ఉండడం తీవ్ర కలకలం రేపింది. అయితే, కేవలం అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్లే వారికి వైరస్​ సోకిందంటున్నారు స్థానికులు. అసలు ఏం జరిగింది?

10 members of a same family found corona positive in hathras uttarpradesh
ఒక్క నిర్లక్ష్యంతో.. ఒకే కుటుంబంలో 10 మందికి కరోనా!

By

Published : May 11, 2020, 11:43 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఏమరపాటు, అజాగ్రత్తలు ఏమాత్రం పనికి రావని మరోసారి రుజువైంది. అవును, ఉత్తర్​ప్రదేశ్​ హాత్రస్ జిల్లా​లో ఆరోగ్య విభాగం నిర్లక్ష్యం.. ఒకే కుటుంబానికి చెందిన పది మందికి కరోనా సోకడానికి కారణమైంది.

ఒక్కరి నిర్లక్ష్యంతో కుటుంబంలో 10 మందికి కరోనా!

ఇదీ జరిగింది..

వారం రోజుల క్రితం.. క్యాన్సర్​తో బాధపడుతున్న వృద్ధుడు​ మందులు తెచ్చుకునేందుకు నోయిడాకు వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించింది జిల్లా ఆరోగ్య విభాగం. అయితే, నమూనాలు తీసుకుని అతడిని క్వారంటైన్​లో ఉంచకుండా ఇంటికి పంపించేసింది.

ఆ తర్వాత రెండు రోజులకు వైద్యపరీక్ష ఫలితాలు వచ్చాయి. ఆ వృద్ధుడికి కరోనా పాజిటివ్​ అని తేలింది. అప్పటికే ఇంటికెళ్లిన అతడు 27 మంది కుటుంబ సభ్యులను కలిశాడు. ఆలస్యంగా తేరుకున్న జిల్లా ఆరోగ్య విభాగం ఆ 27 మందిని నిర్బంధంలోకి తీసుకుని పరీక్షలు నిర్వహించింది. వారిలో 10 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. వారిలో నలుగులు చిన్నారులకు వైరస్​ సోకడం బాధాకరం. ప్రస్తుతం బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఇదీ చదవండి:'భయపడే రోజులు పోయాయి- ఇక బయటకు రావాలి'

ABOUT THE AUTHOR

...view details