కర్ణాటక హవేరి జిల్లా రాణిబెన్నూరులోని వందేమాతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భంగా 10 కిలోల వెండి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ గణేశ్ ప్రతిమ చుట్టూ 500 కిలోల వివిధ రకాల పువ్వులను అలంకరించారు. బంగారం రంగుతో కూడిన కొబ్బరికాయలు, అరటి చెట్లతో మంటపాన్ని ముస్తాబు చేశారు.
వెండి గణపతికి 5 క్వింటాళ్ల పూలతో అలంకరణ - 10 కిలోల వెండి గణనాథుడు
వినాయకచవితిని పురస్కరించుకొని 10 కిలోల వెండి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక హవేరి రాణిబెన్నూరులోని వందేమాతరం అసోసియేషన్. మంటపాన్ని మొత్తం 500 కిలోల వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరించారు.
10 కిలోల వెండి గణనాథుడికి.. 5 క్వింటాళ్ల పూలతో అలంకరణ
ఏటా.. ఈ వందేమాతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. దీనికి 'రాణిబెన్నూరు కా రాజా' అని పేరు పెట్టుకున్నారు.