ముల్లంగి అంటే తెలియనివారుండరు. మన మార్కెట్లలో ఎక్కువగా కనిపించే ముల్లంగి కేవలం వంద, రెండు వందల గ్రాములు ఉంటుంది.. మరీ పెద్దదైతే ఓ కిలో వరకు ఉండొచ్చు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్పుర్ రైతులు సుమారు 10 కిలోల ముల్లంగిని పండిస్తున్నారు. ఒక్కోటి 10 కేజీలుండటం ఇక్కడి మట్టి ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు.
జంబో ముల్లంగి - జౌన్పుర్
ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్‌లో రైతులు 10 కిలోల ముల్లంగి పండిస్తున్నారు.
10 కిలోల ముల్లంగి పండిస్తున్న జౌన్పుర్ రైతులు
ముల్లంగి సాగు చేసిన నాలుగు నెల్లలోనే పది కిలోల వరకు పెరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు. భారీ స్థాయిలో ఉండే ఈ ముల్లంగితో జౌన్పుర్ పేరు ఎంతో ప్రాచుర్యం పొందిందని స్థానికులు అంటున్నారు.
" దీని బరువు పది కిలోలు ఉంటుంది. నాలుగు నెలల్లోనే గరిష్ఠస్థాయికి పెరుగుతుంది. జౌన్పుర్లోనే ఇలా సాధ్యమవుతుంది. ఇక్కడి మట్టి ప్రత్యేకత అది. మేము దీనినే ఎక్కువగా తింటాం.''
-స్థానిక రైతు, జౌన్పుర్