తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పబ్​జీ ఆడినందుకు 10మంది అరెస్ట్​ - గుజరాత్​

ఆన్​లైన్​ క్రీడలు పబ్​జీ, మోమో ఛాలెంజ్​పై గుజరాత్​లోని రాజ్​కోట్​ పోలీసులు నిషేధం విధించారు. ఇకపై ఈ క్రీడలు ఆడితే ఊచలు లెక్కపెట్టాల్సిందేనని తేల్చిచెప్పారు. రెండు రోజుల్లోనే పబ్​జీ అడుతున్న పది మందిని అరెస్ట్​ చేశారు.

పబ్​జీ ఆడినందుకు 10మంది అరెస్ట్​

By

Published : Mar 14, 2019, 8:15 PM IST

స్మార్ట్​ఫోన్​ ఉన్న వారిలో పబ్​జీ( ప్లేయర్​ అన్​నౌన్స్​ బ్యాటిల్​ గ్రౌండ్​)అంటే తెలియని వారుండరు. ఇటీవల ఈ ఆట వల్ల ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చూశాం. ముంబయిలో 11 ఏళ్ల కుర్రాడు పబ్​జీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించాడంటే ఈ ఆట ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

ఆన్​లైన్​ ఆటలైన పబ్​జీ, మోమో ఛాలెంజ్​లపై గుజరాత్​ రాజ్​కోట్​ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలో పబ్​జీని నిషేధిస్తూ పోలీస్​ కమిషనర్​ మనోజ్​ అగర్వాల్ ఈనెల 6న ​ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ఎవరైనా పబ్​జీ ఆడుతూ కనిపిస్తే అరెస్ట్​ చేయాలని నగరవ్యాప్తంగా ఉన్న పోలీస్​స్టేషన్లకు ఆదేశాలిచ్చారు. పిల్లలు, యువతలో హింసాత్మక ప్రవర్తన పెరుగుతోందన్న కారణంతో నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిషేధం అమలులోకి వచ్చినప్పటికీ ఇంకా కొందరిలో మార్పు రాలేదు. రెండు రోజుల్లోనే పబ్​జీ ఆడుతున్న 10 మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. మంగళవారం ఒక్కరోజే కలవడ్​ రోడ్​, జగన్నాథ్​ చౌక్​ ప్రాంతంలో పబ్​జీ ఆడుతున్న ఆరుగురు కళాశాల విద్యార్థులు, ఓ ప్రైవేటు ఉద్యోగిని అరెస్ట్​ చేశారు. మరుసటి రోజున రాజ్​కోట్​ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్​లో ముగ్గురు పట్టుబడ్డారు.

బెయిల్​పై విడుదల

అరెస్టైన పది మందిపై ఐపీసీ సెక్షన్​ 188 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని బెయిల్​పై విడుదల చేశామని తెలిపారు.

అహ్మదాబాద్​ పోలీస్​ కమిషనర్​ సైతంపబ్​జీపై ని​షేధం విధిస్తూ నోటిఫికేషన్​ విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details