10 ఏళ్లలో నరేంద్ర మోదీ సారథ్యాన భారత్ 2030 కల్లా సాధించాలనుకుంటున్న స్వప్నానికి 10 ప్రామాణిక సూత్రాలు నిర్దేశించుకున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్.
10 ఏళ్ల స్వప్నానికి 10 సూత్రాలు - 2030
వివిధ వర్గాలపై వరాల జల్లుకు మాత్రమే పరిమితం కాలేదు ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్. దీర్ఘకాలిక భవిష్యత్‌కు ప్రణాళికలు ఆవిష్కరించారు.
"10 ముఖ్యమైన సూత్రాలను మీ ముందు ఉంచుతున్నా.
⦁ ఈ స్వప్నానికి మొదటి సూత్రం భౌతిక, సామాజిక మౌలిక వసతుల కల్పన.
⦁ రెండవది 'డిజిటల్ ఇండియా' సృష్టి.
⦁ 'కాలుష్యరహిత భారత్ సాకారమే' 3వ సూత్రం.
⦁ అధునాతన సాంకేతికతతో గ్రామీణ పారిశ్రామిక అభివృద్ధి సాధించి భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పన మా స్వప్నంలో నాల్గవ సూత్రం.
⦁ 5వ సూత్రం భారత నదుల పరిశుభ్రత.
⦁ తీర ప్రాంతాలు, సముద్ర జలాలు భారత అభివృద్ధికి విస్త్రతంగా ఉపయోగపడటం 6వ సూత్రం
⦁ మా 7వ సూత్రం అంతరిక్ష్యం వైపు చూపిస్తోంది. 'గగన్‌యాన్' ద్వారా 2022 కల్లా భారత వ్యోమగామి అంతరిక్ష్యంలో అడుగుపెట్టాలి.
⦁ దేశానికి సరిపడే ఆహారం స్వయంగా తయారుచెయ్యాలి. ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా ఉండాలి.
⦁ 'ఆరోగ్య భారత్' 9వ సూత్రం.
⦁ 'కనిష్ఠ ప్రభుత్వం-గరిష్ఠ పాలన' ద్వారా భారత్ రూపాంతరం చెందడం 10వ సూత్రం."
-పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి