ఆ చిన్నారి.. తల్లి కడుపులో ఉండగానే తండ్రి మరణించాడు. సరిగ్గా సంవత్సరం తర్వాత తన తండ్రి విగ్రహం వద్దకు వచ్చింది ఆ పాప. ఈ వ్యక్తి నీ నాన్న అని కుటుంబ సభ్యులు చెప్పగానే.. విగ్రహం దగ్గరికి వెళ్లి 'నాన్నా' అంటూ పలకరించింది. విగ్రహాన్ని కౌగిలించుకొని ముద్దుపెట్టుకుంది. మిఠాయి తినిపించాలనుకుంది.
నాన్నా.. అంటూ తండ్రి విగ్రహానికి చిన్నారి ముద్దులు - తెలుగు తాజా జాతీయం వార్తలు
తను తల్లికడుపులో ఉండగానే తండ్రి మరణించాడు. సంవత్సరం తర్వాత తన తండ్రి విగ్రహం దగ్గరకు వెళ్లి ఆ చిన్నారి.. నాన్నా అని పలకరించింది. ప్రేమతో విగ్రహాన్ని కౌగిలించుకుని ముద్దాడింది. అమర జవాను కూతురి ప్రేమ చూపరులను భావోద్వేగానికి లోను చేసింది.
తండ్రి విగ్రహాన్ని చూసి నాన్నా అని ముద్దుపెట్టుకున్న చిన్నారి
నాన్నా.. అంటూ తండ్రి విగ్రహానికి చిన్నారి ముద్దులు
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్న మూలచందర్.. గతేడాది జనవరిలో జరిగిన నక్సల్స్ దాడిలో అమరుడయ్యాడు. ఆ సమయంలో ఆయన భార్య గర్భవతి. సంవత్సరం తర్వాత మూలచందర్ జయంతి రోజున కుటుంబమంతా అయన విగ్రహానికి నివాళులర్పించారు.
నిజ జీవితంలో తండ్రిని చూడలేకపోయినా.. ఆయన విగ్రహంపై ఆ కూతురు కురిపించిన ప్రేమను చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు.