తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి - సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి

జమ్ముకశ్మీర్​ పూంచ్​ జిల్లాలో పాకిస్థాన్​​ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. మోర్టార్​ షెల్స్​ విసిరి కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక జవాను మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

1 killed, three soldiers injured in Pak shelling along LoC in J-K's Poonch
సరిహద్దులో పాక్​ దుశ్చర్య.. భారత​ జవాన్​ మృతి

By

Published : Feb 8, 2020, 11:39 PM IST

Updated : Feb 29, 2020, 5:00 PM IST

జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద పాక్​ మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. పూంచ్​ జిల్లాలోని దిగ్​​వార్​ సెక్టార్​లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఈ ఘటనలో ఓ భారత జవాను వీరమరణం పొందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

మోర్టార్​ షెల్స్​, చిన్న ఆయుధాలతో మధ్యాహ్నం 3.45 గంటలకు పాక్​ సైన్యం కాల్పులు జరిపిందని రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ చర్యను భారత్​ సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలే లక్ష్యంగా పాక్​ ఈ కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ

Last Updated : Feb 29, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details