తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బీడీల కోసం ఒకటిన్నర కిలోమీటర్ క్యూ! - Lockdown in Rajasthan

నిన్న మొన్నటిదాకా మద్యం షాపుల ఎదుట జనాలు బారులు తీరడం చూశాం. అయితే రాజస్థాన్​లోని ఓ ప్రాంతంలోనూ ప్రజలు భారీ ఎత్తున బారులు తీరారు. అయితే మందు కోసం కాదు.. బీడీల కోసం. వీటి కోసం ఎండను కూడా లెక్కచేయలేదు.

1.5 kilometer long line for Bidi in dausa rajasthan
బీడీల కోసం ఒకటిన్నర కిలోమీటర్ల క్యూలైన్​!

By

Published : May 26, 2020, 10:46 PM IST

రాజస్థాన్​లోని దౌసా జిల్లాలో ఓ షాపు ఎదుట 1.5 కి.మీ మేర భారీ క్యూలైన్​ ఉంది. అది చూసిన వారికి ఏ హిట్​ సినిమా టికెట్​ కోసం నిల్చొన్న అభిమానులో.. సొంతగూటికి వెళ్లడానికి రైలు కోసం చూస్తున్న వలస కూలీలో గుర్తొచ్చారు. కానీ తీరా దగ్గరికి వెళ్లి చూస్తే గానీ అర్థం కాలేదు.. వాళ్లు ధూమపాన ప్రియులని..!

లాక్​డౌన్​ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ బీడీ షాప్​ ఎదుట సుమారు 1.5 కిలోమీటరు మేర బారులుతీరారు. విషయం తెలుసుకొన్న జిల్లా పాలనాధికారి అవిచల్​ చతుర్వేది తక్షణమే ఆ బీడీల దుకాణాన్ని మూసివేయించారు. ఆంక్షలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలోనూ తీవ్రమైన ఎండను లెక్కచేయకుండా.. కేవలం బీడీల కోసం మాస్కులు లేకుండా ప్రజలు బారులుతీరారు.

బీడీల కోసం ఒకటిన్నర కిలోమీటర్ల క్యూలైన్​!

బీడీ, గుట్కా అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అనుమతి ఇచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత షాపులు తెరవడం వల్ల ఇలా ప్రజలు క్యూ కట్టారు.

ఇదీ చదవండి:కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details