తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలకూ చుక్కల మందు టీకా.. ఆ ప్రయోగాలకు అనుమతి కోరిన భారత్‌ బయోటెక్‌ - భారత్​ బయోటెక్​ చుక్కల టీకా ప్రయెగాలు

Intranasal Vaccine: భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా మూడో దశ ప్రయోగాలు నిర్వహించేందుకు డీసీజీఐను ఆ సంస్థ అనుమతి కోరింది. ఈ ఇంట్రానాసల్​ వ్యాక్సిన్​ను 5-18 ఏళ్ల వయసు వారికి ఇవ్వనున్నారు.

Bharat Biotech Intranasal Vaccine:
Bharat Biotech Intranasal Vaccine:

By

Published : Sep 12, 2022, 7:27 AM IST

Bharat Biotech Intranasal Vaccine: 5-18 ఏళ్ల వయసు వారికి ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు (ఇంట్రానాసల్‌) కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ మూడో దశ (ఫేజ్‌-3) ప్రయోగాలు నిర్వహించేందుకు ఔషధ నియంత్రణ సంస్థ 'డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా-డీసీజీఐ'ను భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరింది. 5-18 ఏళ్ల వారికి మూడో దశ పరీక్షల్లో ఆయా వయసుల వారికి ఇది అందించే భద్రత, రోగనిరోధక శక్తి తదితరాలపై మదింపు జరుపుతారు. కొవాగ్జిన్‌తో బీబీవీ154 రోగ నిరోధక శక్తి, భద్రతను పోల్చి చూసేందుకు మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారత్‌ బయోటెక్‌కు డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. దేశంలో 9 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించేందుకు అనుమతించారు.

18 ఏళ్లు పైబడిన వారికి ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇన్‌కోవ్యాక్‌ (బీబీవీ154) అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఈ నెల 6న అనుమతి ఇచ్చింది. దేశంలో ముక్కు ద్వారా అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్​ వ్యాక్సిన్​ ఇదే. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కొవిడ్‌పై పోరులో నాసల్​ వ్యాక్సిన్​ ఒక బిగ్‌ బూస్ట్‌ అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details