కరోనా టీకాపై కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశాయి సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు. దిల్లీ, ఇతర హైకోర్టుల్లో కేసులు సుప్రీంకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాయి.
సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనంలో ఈ వ్యాజ్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. అన్నీ సుప్రీంకు తీసుకురావడం లేదా.. ఏదైనా హైకోర్టుకు బదిలీ చేస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.