Covaxin Omicron: కొత్తగా వెలుగులోకి వచ్చిన కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌పై 'కొవాగ్జిన్' టీకా ఎలా పనిచేస్తుందో పరిశోధిస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం వెల్లడించింది.
'చైనాలోని వుహాన్‌లో పుట్టిన కొవిడ్ వైరస్‌ను నిరోధించేలా కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాం. ఈ టీకా డెల్టా సహా ఇతర వేరియంట్లపైనా సమర్థంగా పని చేసింది. తాజాగా ఒమిక్రాన్ రకంపైనా పరిశోధన కొనసాగుతోంది' అని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి.