తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covaxin X Covishield: 'ఆ నివేదికలో అనేక లోపాలు' - covishield vaccine produces more antibodies

కొవాగ్జిన్‌ టీకాను కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను పోలుస్తూ ఓ జర్నల్​లో ప్రచురించిన కథనంపై భారత్‌ బయోటెక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవాగ్జిన్‌ కంటే కొవిషీల్డ్‌ వ్యాక్సినే అధికంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందంటూ వచ్చిన కథనాన్ని ఖండించింది.

bharat biotech
భారత్​ బయోటెక్​

By

Published : Jun 9, 2021, 3:40 PM IST

Updated : Jun 9, 2021, 10:46 PM IST

కొవాగ్జిన్‌ టీకా కంటే కొవిషీల్డ్‌ వ్యాక్సినే అధికంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందంటూ ఓ జర్నల్‌లో ప్రచురితమైన కథనాన్ని భారత్‌ బయోటెక్‌ ఖండించింది. కొవాగ్జిన్‌ టీకాను కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను పోలుస్తూ ప్రచురించిన ఈ కథనంపై భారత్‌ బయోటెక్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకటి, రెండు డోసుల తర్వాత భారత వ్యాక్సిన్ల పనితీరుపై వెలువరించిన ఈ నివేదికలో చాలా లోపాలున్నాయని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

కొవాగ్జిన్‌ మూడవదశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను జులైలో బహిరంగ పరుస్తామని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఈ డేటాను తొలుత సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్​సీఓ)కు సమర్పిస్తామని.. ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్‌కు అందిస్తామని తెలిపింది. మూడోదశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్‌ పూర్తి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌.. రెండూ భేష్‌

Last Updated : Jun 9, 2021, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details