Bharat Biotech Nasal Vaccine : భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్ టీకా (బీబీవి154/నాసల్ వ్యాక్సిన్) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. కొవిడ్‌పై పోరులో నాసల్ వ్యాక్సిన్ ఒక బిగ్ బూస్ట్ అని పేర్కొన్నారు.
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ - bharat biotech nasal vaccine update
![భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ Bharat Biotech gets emergency use authorisation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16297926-thumbnail-3x2-bharat-biotech-nasal-vaccine.jpg)
15:00 September 06
భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్
18 ఏళ్లు దాటిన వారికి ఈ టీకా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతిని ఇచ్చింది. అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో ముక్కు ద్వారా అందుబాటులోకి వచ్చిన తొలి కొవిడ్ వ్యాక్సిన్ ఇదే. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సహా పలు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఇవీ చదవండి:నడిరోడ్డుపై పోలీసుల కొట్లాట.. విధుల నుంచి తొలగింపు
'భారత్‌తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'