ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం ప్రధాని నిబద్ధత ఆదర్శప్రాయమని భారత్ బయోటెక్ కొనియాడింది. మనమంతా కలిసి కొవిడ్-19పై పోరాటం చేసి విజయం సాధించాలని పేర్కొంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను నరేంద్ర మోదీ తీసుకోవడంపై ఈమేరకు స్పందించింది.
ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి..
మోదీకి ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా టీకా ఇచ్చారు. టీకా తీసుకున్న సమయంలో అసోంలో తయారు చేసిన గమ్చా(కండువా)ను ధరించి మోదీ కనిపించారు. అసోం మహిళల ఆశీస్సులకు చిహ్నంగా ఆయన ఈ వస్త్రాన్ని ధరించారు. గతంలోనూ చాలా సందర్భాల్లో మోదీ దీన్ని ధరించడం విశేషం. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయన ఉదయాన్నే ఎయిమ్స్‌కు వెళ్లి కొవిడ్ టీకా తీసుకున్నారు. ఇక టీకా వేసే సమయంలో కేరళకు చెందిన మరో నర్సు కూడా అక్కడ ఉన్నారు.
ఇవీ చదవండి: