పంజాబ్‌లోని అమృత్ సర్-దిల్లీ రైల్వే ట్రాక్‌పై అర్ధనగ్నంగా బైఠాయించారు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ సభ్యులు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైలు పట్టాలపై రైతుల అర్ధనగ్న నిరసన - కిసాన్ మజ్దూర్ సంఘ్
12:25 March 26
అర్ధ నగ్న నిరసన
10:03 March 26
4 రైళ్లు రద్దు
బంద్ నేపథ్యంలో పంజాబ్, హరియాణాలోని 31 ప్రాంతాల్లో రైతులు రహదారులపై బైఠాయించారు. ఈ తరుణంలో దిల్లీ, అంబాలా, ఫిరోజ్‌పుర్ డివిజన్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 4 శతాబ్ది రైళ్లను రద్దు చేసినట్లు భారత రైల్వే శాఖ పేర్కొంది.
09:27 March 26
గాజీపుర్ వద్ద అన్నదాతల నృత్యాలు
భారత్ బంద్‌లో భాగంగా.. గాజీపుర్ సరిహద్దు వద్ద అన్నదాతలు పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..బంద్‌లో పాల్గొన్నారు.
08:16 March 26
రైల్వే ట్రాక్‌పై బైఠాయించిన రైతులు
12 గంటల భారత్ బంద్‌లో భాగంగా అంబాలా షాహ్పూర్లో రైల్వే ట్రాక్‌పై బైఠాయించారు రైతులు. మరికొందరు రైతులు జీటీ రోడ్డును నిర్భందించారు.
07:58 March 26
లైవ్ అప్డెట్స్: భారత్ బంద్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు శుక్రవారం సంపూర్ణ భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు వరకు సాగే ఈ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమాఖ్య, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎమ్) ప్రజలకు విజ్ఞప్తి చేశాయి.
ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మినహా దేశమంతా రోడ్డు, రైలు, రవాణా సేవలను నిలిపివేస్తామని, మార్కెట్లను స్తంభింపజేస్తామని పేర్కొంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ బంద్‌కు పిలుపిచ్చినట్లు ఎస్‌కేఎమ్ తెలిపింది. బంద్‌కు తాము మద్దతివ్వడం లేదని అఖిల భారత వర్తకుల సమాఖ్య ప్రకటించింది.
దిల్లీ-యూపీ సరిహద్దు ఘజియాబాద్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేతల ఆధ్వర్యంలో సాగు చట్టాలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.