తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​లో 'ఆప్' మార్క్.. వారికి భద్రత కట్.. ప్రజాసేవకు వందలాది పోలీసులు! - Punjab Election Result

Bhagwant mann news: పంజాబ్​లో ఆప్​ మార్క్ పాలన షురూ అయింది. రాష్ట్రంలోని 122 మంది నేతలకు భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్ తెలిపారు. ఫలితంగా వందలాది మంది పోలీసులు ఇకపై సామాన్యులకే సేవలు అందిస్తారని స్పష్టం చేశారు. మరోవైపు పంజాబ్​కు నిజాయితీ గల సీఎం రానున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

bhagavanth singh mann
భగవంత్ సింగ్ మాన్

By

Published : Mar 13, 2022, 5:40 PM IST

Bhagwant mann news: పంజాబ్​లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్​ఆద్మీ పార్టీ.. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్​లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ వాహనాలు పోలీస్ స్టేషన్​లకు వెళ్లిపోయాయని అన్నారు.

దుర్గామాత ఆలయంలో కేజ్రీవాల్ పూజలు

ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండొద్దని.. భగత్​ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు మాన్. పంజాబ్​లో ఆమ్​ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమృత్​సర్​లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.

జలియన్ వాలా బాగ్ స్మారకం వద్ద కేజ్రీవాల్, మాన్
జలియన్ వాలా బాగ్ స్మారకాన్ని సందర్శించిన ఆప్ నేతలు

Arvind kejriwal news: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

"నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్​కు నిజాయితీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాన్ చాలా నిజాయితీపరుడు. ప్రభుత్వానికి వచ్చే రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం."

-- ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్

ఆప్​కు చెందిన రాజకీయ నేతగానీ, ఎమ్మెల్యే గానీ ఏదైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. పంజాబ్​లోని దిగ్గజ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్​బీర్ సింగ్ బాదల్​, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్​జీత్ సింగ్​ చన్నీ, బిక్రమ్ సింగ్ మజితియాను ప్రజలు ఓడించి ఇంటికి పంపారని అన్నారు. కేవలం మాన్ ఒక్కరే కాదని.. పంజాబ్​లోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రేనన్నారు కేజ్రీవాల్.

అమృత్​సర్ ఆలయంలో కేజ్రీవాల్

Punjab Election Result: ఇటీవల జరిగిన పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు కైవసం చేసుకుంది ఆప్​. పంజాబ్​ ముఖ్యమంత్రిగా భగవంత్​ సింగ్​ మాన్​ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్​సింగ్​ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్​కలన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఇవీ చూడండి:ఉత్తరాఖండ్​కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?

సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్​'!

సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్​గానే..

ABOUT THE AUTHOR

...view details