ఆయుర్వేద ఔషధం బీజీఆర్-34ను గ్లిబెన్క్లమైడ్ అనే అల్లోపతి మందుతో కలిపి తీసుకుంటే మధుమేహాన్ని సమర్థంగా కట్టడి చేయవచ్చని 'ఎయిమ్స్' వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. బీజీఆర్-34ను హిమాలయాల్లోని ఎగువ ప్రాంతం నుంచి సేకరించిన మూలికలతో తయారుచేశారు. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్(సీఐఎంఏపీ), నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్బీఆర్ఐ) శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధన అనంతరం ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు.
మధుమేహాన్ని కట్టడి చేసే అద్భుత మిశ్రమం! - షుగర్ వ్యాధి ఔషధాలు
మధుమేహాన్ని కట్టడి చేసేందుకు ఆయుర్వేద ఔషధాన్ని అల్లోపతి మందుతో కలిపి తీసుకోవడం ఉత్తమమని 'ఎయిమ్స్' వైద్యుల పరిశోధనల్లో తేలింది. హిమాలయ ప్రాంతం నుంచి సేకరించిన మూలికలతో తయారైన బీజీఆర్-34ను గ్లిబెన్క్లమైడ్ అనే అల్లోపతితో కలపడం ద్వారా.. వాటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఈ ఔషధంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్టు పేర్కొన్నారు పరిశోధకులు. ఫలితంగా గుండె ధమనుల్లో చెడు కొలెస్ట్రాల్ చేరదని చెప్పారు. గ్లిబెన్క్లమైడ్తో కలిపి దీన్ని తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది పరిశీలించేందుకు 'ఎయిమ్స్' వైద్యులు ప్రయోగాలు జరిపారు. ఇందులో భాగంగా కొందరికి ఈ రెండు ఔషధాలను కలిపి ఇవ్వగా.. మరికొందరికి వేర్వేరుగా ఇచ్చారు. రెండు మందులను కలిపి తీసుకున్న వారిలో ఇన్సులిన్ స్థాయి మెరుగుపడిందని మధ్యంతర ఫలితాల్లో వెల్లడైంది. బీజీఆర్-34కు కొలెస్ట్రాల్‌ను తగ్గించే సామర్థ్యం ఉన్నట్టు కూడా తేలింది.
ఇదీ చదవండి:సూక్ష్మ తుంపర్లలోని వైరస్‌ను హతమార్చే కొత్త సాధనం