తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్ బస్సు మిస్​ అయిందని.. విద్యార్థి ఆత్మహత్య! - స్కూల్ బస్సు మిస్​ అయిందని విద్యార్థి ఆత్మహత్య

స్కూల్ బస్సు మిస్సైందని ఓ పాఠశాల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బేతూల్ జిల్లాలో జరిగింది.

student committed suicide in betul district
మధ్యప్రదేశ్ బేతూల్ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

By

Published : Nov 22, 2021, 10:19 PM IST

ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే ఒత్తిడికి గురవుతున్నారు చాలా మంది. చిన్న వయసులోనే మానోవేధనతో తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్​లో జరిగింది. స్కూల్ బస్సు మిస్సైందని ఓ పాఠశాల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బేతూల్ జిల్లా ఘోరదోంగ్రీ మండలంలోని అమ్డోహ్ గ్రామంలో.. రాహుల్​(14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. కానీ రాహుల్ వెళ్లేసరికే బస్సు వెళ్లిపోయింది. దీంతో మనోవేధనకు లోనై ఇంట్లోని మామిడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఆస్పత్రికి తీసుకెళ్లితే అప్పటికే రాహుల్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాహుల్ ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేవాడని, చాలా క్రమశిక్షణ కలిగిన బాలుడని అతని అంకుల్ వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:ఫ్యాక్టరీ డ్రైనేజీలో చిన్నారి మృతదేహం.. అత్యాచారం చేసి!

వీడియోకు పోజులిస్తుండగా.. రైలు ఢీకొని యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details