మధ్యప్రదేశ్ బేతుల్‌లో దారుణం జరిగింది. మహిళలు, బాలికల ముందు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు ఇద్దరు వ్యక్తులు. నిందితులను బిజాదేహి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేతుల్ జిల్లా బిజాదేహి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజలీ గ్రామానికి చెందిన మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి మహిళల ముందు నగ్నంగా అసభ్యకర చర్యలకు దిగేవాడు. రహస్య భాగాలను చూపించేవాడు. దీంతో విసిగిపోయిన ఇద్దరు వ్యక్తులు.. బాధితుడి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత బాధితుడిని చిచోలిలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి మానసిక పరిస్థితి సరిగా లేదని సమాచారం.