ఆన్లైన్ గేమింగ్ ఫలితంపై బెట్టింగ్‌లో పాల్గొనడాన్ని ఇక అనుమతించబోమని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అయితే దానికి సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఆయన సోమవారం విడుదల చేశారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 17లోగా తెలపాలని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సూచించారు. అందుకు సంబంధించిన పూర్తి నియమనిబంధనలు ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
త్వరలో ఆన్లైన్ గేమ్స్‌లో బెట్టింగ్ బ్యాన్.. ఫిబ్రవరిలో నిబంధనలు అమలు! - games oniline betting
మీరు ఆన్లైన్ గేమింగ్‌లో బెట్టింగ్ చేస్తున్నారా? అందులో డబ్బులు బాగా సంపాదిద్దాం అనుకుంటున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్.. త్వరలో ఆన్లైన్ గేమింగ్‌లో బెట్టింగ్ బ్యాన్ కానుంది!.. ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
![త్వరలో ఆన్లైన్ గేమ్స్‌లో బెట్టింగ్ బ్యాన్.. ఫిబ్రవరిలో నిబంధనలు అమలు! Betting on outcomes of games will not be allowed; rules expected in Feb : MoS IT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17379880-thumbnail-3x2-eee.jpg)
Betting on outcomes of games will not be allowed; rules expected in Feb : MoS IT
"స్వీయ నియంత్రణ నిబంధనలకు లోబడి ఇకపై అన్ని ఆన్లైన్ గేమింగ్ సంస్థలు ఆమోదపత్రం తీసుకోవాలి. ఈ నిబంధనల ప్రకారం ఇకపై గేమ్ ఫలితాలపై బెట్టింగ్‌కు అనుమతించం. ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని అభివృద్ధి చేసి.. కొత్త ఆవిష్కరణను ప్రోత్సహించడమే మా లక్ష్యం. దానికి అనుగుణంగానే నియమాలు తయారుచేశాం. భారత్‌లో ఈ నిర్ణయం ద్వారా గేమింగ్ రంగంలో మరిన్ని స్టార్టప్‌లు పెరుగుతాయి. 2023లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా అభివృద్ధి చెందనుంది" అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.