Best Tourism Spot Himachal Pradesh : కొత్త సంవత్సరానికి జనం గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. మళ్లీ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. అయితే.. జీవితమంతా డ్యూటీలోనే కాలం గడిపేయడం మంచిది కాదని మానసిక నిపుణులు చెప్తూనే ఉంటారు. దీనివల్ల.. మానసికంగా అలసిపోవడంతోపాటు ప్రొడక్షన్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందని అంటారు. అందుకే.. అప్పుడప్పుడూ "చిల్" అవ్వాలని... ఆర్నెల్లకు ఒకసారి, కుదరకపోతే ఏడాదికి ఒకసారైనా టూర్‌కు వెళ్లి రావాలని సూచిస్తుంటారు. దీనివల్ల.. ఫుల్ రీఛార్జ్ అవుతారని, మెంటల్లీ స్ట్రాంగ్‌గా తయారవడంతోపాటు వర్క్‌లోనూ యాక్టివ్ అవుతారని చెబుతుంటారు. అందుకే.. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా టూర్ ప్లాన్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో మేం చెప్తాం. అద్భుతమైన మెమొరీస్ బ్యాగుల నిండా నింపుకొని వచ్చేయండి.
ఛలో.. హిమాచల్!
చలి కాలంలో చుట్టి రావడానికి నార్త్‌లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో.. హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అద్దిరిపోయే హిల్ స్టేషన్లకు పెట్టింది పేరు హిమాచల్. దేశం నలు మూలల నుంచి ఇక్కడ వాలిపోయే వారికి కొదవే ఉండదు. లక్షలాదిగా తరలి వస్తారు. అంతలా.. టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి ఇక్కడి ప్రదేశాలు. సిమ్లా, కులు-మనాలి ధర్మశాల వంటి సుప్రసిద్ధ ప్రదేశాలను ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అన్నది టూరిస్టుల మాట. అయితే.. ఈ ఫేమస్ ప్రాంతాలు నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. ఇలా కాకుండా కాస్త ప్రశాంతంగా ప్రకృతిలో గడిపి రావాలని అనుకుంటే.. అలాంటి ప్రాంతాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
కసోల్..
హిమాచల్ అందాలను కళ్లకు కడుతుంది కసోల్ ప్రాంతం. ఇది స్వర్గానికి కాస్త దూరంలోనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తుందంటే నమ్మాల్సిందే. ఇక్కడ ఎంతో అందమైన లోయలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కసోల్.. టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ పార్టీలను ఆస్వాదించడంతోపాటు, పార్వతి నది, మణికరణ్ హాట్, మలానా, తోష్ విలేజ్, ఖీర్‌గంగా పీక్ వంటి ది బెస్ట్ టూరిస్టు ప్రాంతాలను చూసిరావొచ్చు.
కుఫ్రీ..