తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ క్లీనింగ్ టిప్స్ పాటించారంటే - మీ వాష్ బేసిన్ తళతళా మెరిసిపోతుంది! - Wash Basin Cleaning Tips

Tips for Wash Basin Clean : వాష్ బేసిన్ వాడుతూ ఉంటే.. కొన్నాళ్లకు మరకలు పడతాయి. ఎన్ని సార్లు క్లీన్ చేసినా మురికిగానే కనిపిస్తూ ఉంటుంది. ఏవేవో కెమికల్స్, యాసిడ్స్ వాడినా ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తుంది. మేము చేప్పే ఈ సహజమైన టిప్స్ ట్రై చేశారంటే.. మీ వాష్ బేసిన్ కొత్తదానిలా మెరిసిపోవాల్సిందే!

Wash Basin Cleaning
Wash Basin

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 12:28 PM IST

Best Tips for Wash Basin Clean : ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంటూ.. మంచి సువాసనలు వెదజల్లాలని మహిళలు కోరుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో ఏ మూలన కూడా మురికి లేకుండా.. నీట్​గా కనిపించాలనుకుంటారు. క్లీన్​గా ఉండడం కోసం ప్రతిరోజూ ఇంట్లో చీపురుతో ఊడవటం.. మాబ్​తో శుభ్రం చేయడం చేస్తుంటారు. ఇన్ని చేసినా కానీ.. ఎంతకీ శుభ్రంకానీ ప్రాంతాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి వాష్ బేసిన్. ఫేస్ వాష్​, హ్యాండ్ వాష్ అంటూ.. నిత్యం పదుల సంఖ్యలో దీన్ని ఉపయోగిస్తుంటారు. దీంతో అది మురికిగా మారుతూ చాలా త్వరగా పసుపు రంగులోకి మారుతుంది. చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటుంది.

How to Clean Wash Basin in Telugu :అయితే.. చాలా మందికి టైమ్ లేక వారానికి ఒకసారి వాష్ బేసిన్ క్లీన్ చేస్తుంటారు. దీంతో.. వేగంగా బేసిన్​లో మెరుపు మాయమైపోతుంది. పసుపు రంగు కమ్ముకొస్తుంది. దీంతో.. ఆ బేసిన్​ క్లీనింగ్ మహిళలకు పెద్ద సవాలుగా మారుతుంది. ఏవేవో కెమికల్స్, యాసిడ్స్ తెచ్చి వాడుతుంటారు. అవి ఖర్చుతో కూడుకున్నవైనా.. ఫలితం మాత్రం కనిపించదు. అందుకే.. మేము చెప్పే ఈ సహజమైన చిట్కాలతో(Cleaning Tips) మీ వాష్ బేసిన్​ను ఈజీగా చాలా వేగంగా శుభ్రం చేసుకోవచ్చు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బేకింగ్ సోడా : సాధారణంగా అందరి ఇళ్లలో బేకింగ్ సోడా ఉంటుంది. వివిధ వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. ఈ బేకింగ్ సోడాతో.. మీ వాష్ బేసిన్ ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది ఖరీదైనది కూడా కాదు. కాబట్టి మీరు బేకింగ్ సోడాను ఉపయోగించి ఇప్పుడే మీ వాష్ బేసిన్​ను​ కడిగారనుకోండి.. తళతళా మెరిసిపోవడం ఖాయం.

నిమ్మకాయ : ఏదైనా మరకను శుభ్రం చేయడంలో నిమ్మకాయ బాగా సహాయపడుతుంది. అలాగే ఇప్పుడు వాష్ బేసిన్ నుంచి పసుపు, మొండి మరకలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మురికి చేరకుండా నివారిస్తుంది. మీ ఇంట్లో కనుక నిమ్మకాయలు ఉంటే ఇప్పుడే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి.

How to Get Rid of Smell in Bathroom : ఈ టిప్స్ పాటించండి.. మీ బాత్రూమ్ దుర్వాసనొస్తే అడగండి..!

వైట్ వెనిగర్ :మరో సూపర్ చిట్కా ఏంటంటే.. వైట్ వెనిగర్​తో మీ వాష్ బేసిన్ శుభ్రం చేశారంటే కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది. అలాగే పైపులో అట్టు కట్టిన చెత్త కూడా పోతుంది. ఆలస్యమెందుకు ఇప్పుడే ఓసారి దీనిని ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉందనేది మీరే చెప్తారు.

కూల్ డ్రింక్స్ :ఇక పోతే మరో అదిరిపోయే టిప్ ఏంటంటే.. మీరు తాగే కూల్ డ్రింక్స్‌తో కూడా వాష్ బేసిన్ మెరిసేలా చేయవచ్చు. మీ మురికి వాష్ బేసిన్‌ను కూల్​డ్రింగ్స్ బాగా శుభ్రపరుస్తాయి. ఏ రకమైన కఠినమైన నల్ల మచ్చ అయినా ఇట్టే తొలగిపోతుంది.

Cleaning Tips : ఇల్లే కాదు.. వీటినీ వారానికోసారి శుభ్రం చేయాల్సిందే..!

వంటింట్లో పేరుకున్న జిడ్డును తొలగించేయండిలా..!

ABOUT THE AUTHOR

...view details