Hyderabad Best 7 Shopping Malls :హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి చార్మినార్, బిర్యానీ, ట్యాంక్‌బండ్, మరికొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు. దేశవ్యాప్తంగా.. పర్యాటకులు అధికంగా సందర్శించే నగరాల్లో భాగ్యనగరం(Hyderabad) ఒకటి. ఇలాంటి నగరంలో ది బెస్ట్ అనే షాపింగ్ మాల్స్ కొన్ని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటిలో కేవలం షాపింగ్ మాత్రమే కాకుండా.. వినోదం, ఆహారం, విశ్రాంతి కోసమూ ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి. మరి, పండగల నేపథ్యంలో హైదరాబాద్‌లో షాపింగ్ చేయాలని చూస్తున్నారా? మీ లాంటి వారికోసమే.. ది బెస్ట్ షాపింగ్ మాల్స్(Shopping Mall) లిస్టు ఇక్కడ ఇస్తున్నాం.
సిటీ సెంటర్ షాపింగ్ మాల్(City Centre Shopping Mall) :హైదరాబాద్‌లోని అత్యుత్తమ షాపింగ్ మాల్స్‌లో ఒకటి. ఈ షాపింగ్ మాల్ అన్ని రకాల వస్తువులు లభిస్తాయి. ఆహార ప్రియులకు స్వర్గధామం. యారో, అడిడాస్, బిబా, ముఫ్తీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల రిటైల్ అవుట్‌లెట్‌లు ఇందులో ఉన్నాయి. అనేక రకాల వినోదాలు కూడా ఇక్కడున్నాయి. ఈ మాల్‌లో నాలుగో అంతస్తులో ప్రసిద్ధ గేమింగ్ అరేనా, SMAAASH ఉంది.
ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతం :బంజారాహిల్స్, హైదరాబాద్
టైమింగ్స్ :ఇది అన్ని రోజులు 11 AM - 9:30 PM వరకు తెరిచి ఉంటుంది.
ఇనార్బిట్ మాల్(Inorbit Mall) :దాదాపు అన్ని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న అత్యంత ప్రముఖమైన షాపింగ్ మాల్ ఇది. మీరు H&M, Vero Moda, Calvin Klein, Hush Puppies, Nike, Marks & Spencer లాంటి కొన్ని బ్రాండ్లకు చెందిన వస్తువులను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. పండగల సీజన్‌లో ఆఫర్లు, డీల్స్ ఎక్కువగా ఉపయోగించుకోవాలని భావిస్తే.. మాల్‌లో మ్యాక్స్, లైఫ్‌స్టైల్, పాంటలూన్స్ కూడా ఉన్నాయి. మంచి ఆహారాన్ని తినడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఫ్యూజన్ 9, మ్యాడ్ అబౌట్ చైనా, బీర్ హౌస్, డైలాగ్ ఇన్ ది డార్క్, క్రీమ్ స్టోన్, ఇండియన్ తడ్కా లాంటి ఫుడ్స్ ఇక్కడ లభిస్తాయి. వీటన్నింటికీ అదనంగా, మాల్‌లో SMAAASH, PVR కూడా ఉన్నాయి.
ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రదేశం : మాదాపూర్, హైదరాబాద్
టైమింగ్స్ : 11 AM - 9:30 PM (రిటైల్), 11 AM - 11 PM (భోజనం)
ఫోరమ్ సుజనా మాల్(Forum Sujana Mall) :షాపింగ్ మాల్స్ ఈ రోజుల్లో మీ స్నేహితులతో సమావేశానికి, కలుసుకోవడానికి కూడా మంచి ప్రదేశంగా మారాయి. మరి, మీరు హైదరాబాద్‌లోని అలాంటి మాల్ కోసం వెతుకుతున్నట్లయితే.. ఫోరమ్ సుజనా మాల్ బెస్ట్ ఛాయిస్. హైదరాబాద్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన, అతిపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇదొకటి. ఫారెవర్ 21, మార్క్స్ & స్పెన్సర్, హామ్లీస్, జారా, అడిడాస్, అలెన్ సోలీ, అన్ని ప్రధాన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లను కలిగి ఉంది. సినీ ప్రేమికుల కోసం సినిమా హాళ్లు, వారికి ఇష్టమైన గేమింగ్ ఏరియా కూడా ఉన్నాయి.
ఈ షాపింగ్ మాల్ ఉన్న ప్రాంతం :కూకట్‌పల్లి, హైదరాబాద్
టైమింగ్స్ : అన్ని రోజుల్లో 10 AM - 10 PM వరకు ఓపెన్ ఉంటుంది.
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా?.. అప్రమత్తంగా ఉండండి లేకుంటే కష్టమే!
బాబూఖాన్ మాల్(Babukhan Mall) : 80,000 చదరపు అడుగుల స్థలంలో విస్తరించి ఉన్న బాబుఖాన్ మాల్ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌ల ఆసక్తికరమైన శ్రేణిని కలిగి ఉంది. గ్లోబల్ స్టోర్‌లలో లిస్ట్ చేయబడిన తాజా ఉపకరణాలు, దుస్తులను చూడటం లేదా కొనుగోలు చేయడం ద్వారా మీరు సులభంగా ఒక రోజు గడపవచ్చు.
లొకేషన్ :సోమాజిగూడ, హైదరాబాద్