తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Best Job Tips For Freshers : తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే జాబ్ గ్యారెంటీ! - how to develop job skills

Best Job Tips For Freshers In Telugu : మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారా? తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో చెప్పిన టిప్స్ పాటిస్తే.. కచ్చితంగా జాబ్​ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్స్​కు మాత్రమే కాదు.. ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. మరెందుకు ఆలస్యం ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.

Best interview tips For Freshers
Best Job Tips For Freshers

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 12:39 PM IST

Best Job Tips For Freshers :భారతదేశంలో నేడు ఉద్యోగం సంపాదించాలంటే.. విపరీతమైన పోటీని తట్టుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. చాలా మంది విద్యార్థులు తమ చదువు పూర్తయిన తరువాత ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడతారు. మంచి సంస్థలో ఉద్యోగం వస్తుందా? లేదా? అసలు పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం సాధించగలమా? లేదా? అని భయపడుతూ ఉంటారు.

కొంత మంది అభ్యర్థులు తమ తోటి వారికి ఉద్యోగం వస్తే.. ఆ ఉద్యోగం తమకెందుకు రాలేదని మదనపడిపోతూ ఉంటారు. కొన్ని సార్లు ఆత్మన్యూనతకు గురవుతూ ఉంటారు. ఇది ఎవరో ఒకరికి సంబంధించిన సమస్య కాదు. మనలో చాలా మంది ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా మొదటిసారి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇలాంటి భయాలు చాలానే ఉంటాయి. కానీ మీరు అంతగా చింతించాల్సిన పనిలేదు. కేవలం కొన్ని టిప్స్​ పాటిస్తే చాలు. సులువుగా కోరుకున్న ఉద్యోగం సంపాదించవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ గురించి మీరే తెలుసుకోవాలి?
Tips To Get A Job As Fresher :ముందుగా మీరు మీ విద్యార్హతలను, నైపుణ్యాలను, శక్తి, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీరు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారో మీరే స్వయంగా తెలుసుకొని.. వాటిని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి. ఉద్యోగానికి కావల్సిన అన్ని అర్హతలను, నైపుణ్యాలను సంపాదించుకోవాలి.

ఇంటర్న్‌షిప్/ అప్రెంటీస్​షిప్​ చేయాలి!
Internship Benefits For Freshers : చాలా మంది చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడతారు. కానీ అంతకంటే ముందుగా ఏదైనా మంచి కంపెనీలో ఇంటర్న్​షిప్​ లేదా అప్రెంటీస్​షిప్ చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల కంపెనీల్లో ఏ విధంగా పని చేయాలనే అంశంపై మీకు ఒక మంచి అవగాహన ఏర్పడుతుంది. అందుకే చాలా కంపెనీలు ఇంటర్న్​షిప్​ లేదా అప్రెంటీస్​షిప్ చేసిన అభ్యర్థులను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తాయి. కనుక మీరు కూడా ఇలా ఇంటర్న్​షిప్ చేసి, లేదా అప్రెంటీస్​గా పనిచేసి మంచి ఎక్స్​పీరియన్స్ సంపాదించడం మంచిది. దీని వల్ల మీ ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి.

ప్రజెంటేషన్‌ స్కిల్స్ పెంచుకోవాలి!
How To Improve Presentation Skills : కొంత మంది అభ్యర్థులకు మంచి విషయపరిజ్ఞానం (నాలెడ్జ్​) ఉన్నప్పటికీ.. సరైన ప్రజెంటేషన్​ స్కిల్స్ లేక ఉద్యోగం పొందడంలో విఫలమవుతూ ఉంటారు. వాస్తవానికి నేటి పోటీ ప్రపంచంలో తమ శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ఎవరైతే ప్రజెంట్ చేసుకోగలుగుతారో, వారే విజయం సాధించగలుగుతారు. అందుకే విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే మీ ప్రజెంటేషన్ స్కిల్స్​ను అభివృద్ధి చేసుకోవాలి. తరచుగా మాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొనాలి. దీని వల్ల మీలోని బెరుకుతనం, భయం పోతాయి. పైగా మీకు తెలిసిన విషయాన్ని.. ఇంటర్వ్యూ చేసేవారికి చాలా స్పష్టంగా వివరించగలిగే నైపుణ్యం వస్తుంది. దీని వల్ల మీరు ఉద్యోగం పొందే అవకాశాలు బాగా మెరుగువుతాయి.

నిపుణుల సలహాలు తీసుకోవాలి!
ఫ్రెషర్స్ తమ మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సంపాదించాలంటే.. సంబంధిత రంగానికి చెందిన నిపుణుల, అనుభవజ్ఞుల సలహాలను కచ్చితంగా తీసుకోవాలి. వారి సూచనల మేరకు మీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. ఉన్న నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయాలి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంచుకోవాలి!
How To Develop Your Professional Skills :నేడు జాబ్​ మార్కెట్​లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల కోరుకున్న జాబ్​ సంపాదించాలంటే.. అకడమిక్ స్టడీస్​ మాత్రమే సరిపోవు. ఎప్పటికప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇండస్ట్రీ స్కిల్స్​తో పాటు, సాఫ్ట్ స్కిల్స్​ను​ కచ్చితంగా మెరుగుపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు డిమాండ్​ ఉన్న కోర్సులను నేర్చుకుంటా అప్​డేట్ అవుతూ ఉండాలి. దీని వల్ల జాబ్ పొందే అవకాశాలు చాలా పెరుగుతాయి.

మీ ప్రొఫైల్‌ ఆకర్షణీయంగా ఉండాలి!
How To Write Good CV Profile For Job : రిక్రూటర్లను ఆకర్షించే విధంగా మీ ప్రొఫైల్​ను రూపొందించుకోవాలి. అప్పుడే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అవసరమైతే మంచి ప్రొఫెషనల్​ సహాయంతో మీ రెజ్యూమ్​/ సీవీలను తయారుచేసుకోవాలి. అందులో మీ వ్యక్తిగత వివరాలతో పాటు, మీ విద్యార్హతలు, నైపుణ్యాలను చాలా స్పష్టంగా తెలియజేయాలి. మీ ప్రొఫైల్ చూడగానే.. మీ వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందనే నమ్మకాన్ని కలిగించాలి. దీని వల్ల మీకు ఉద్యోగం లభించే అవకాశాలు బాగా మెరుగువుతాయి.

ఆన్​లైన్​లో యాక్టివ్​గా ఉండాలి!
నేటి కాలంలో ఆన్​లైన్​ ప్రెజెన్స్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. కనుక మీరు ఆన్​లైన్ జాబ్​ పోర్టల్స్​లో చాలా యాక్టివ్​గా ఉండాలి. మీ ప్రొఫైల్ చాలా ఆకర్షణీయంగా ఉండాలి. దీని వల్ల లైక్​-మైండెడ్ పీపుల్​తో, ఇండస్ట్రీ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దీని వల్ల జాబ్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. అంతేకాదు ఉద్యోగ అవకాశాలు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. వాస్తవానికి ఈ టిప్స్​ ఫ్రెషర్స్​కు మాత్రమే కాదు.. ఇప్పటికే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారందరికీ ఎంతో ఉపయోగపడతాయి.

ఈ విధంగా మీరు ఇండస్ట్రియల్ స్కిల్స్​, సాఫ్ట్​ స్కిల్స్​, ప్రజెంటేషన్​ /కమ్యునికేషన్ స్కిల్స్ సహా ప్రాక్టికల్ ఎక్స్​పీరియన్స్​ను కలిగి ఉంటే.. జాబ్​ రావడం గ్యారెంటీ! ఆల్​ ది బెస్ట్​!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

Best Freelance Websites In Telugu: ఫ్రీలాన్సర్​గా పనిచేయాలనుకుంటున్నారా?.. టాప్ 10 ఫ్రీలాన్సింగ్​ వెబ్​సైట్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details