తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Best Courses for After Intermediate : ఇంటర్ తర్వాత ఈ కోర్సులు ఎంచుకోండి.. కెరియర్​లో ఎదగండి! - ఇంటర్ తర్వాత ఉత్తమ కేరీర్ ఆప్షన్స్

Best Career Options After Intermediate : భవిష్యత్ ఎలా ఉండాలన్నది.. ఇంటర్ తర్వాత తీసుకునే నిర్ణయం మీదనే చాలా వరకు ఆధారపడి ఉంటుందని అంటారు నిపుణులు. అందుకే.. ఇంటర్మీడియట్ తర్వాత ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక చాలా మంది తికమకపడుతుంటారు. అలాంటి వారికోసమే ఈ స్టోరీ.

Best Courses for After Intermediate
Best Courses for After Intermediate

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 3:22 PM IST

Which is Best Course for After Intermediate :ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు.. ఆ తర్వాత ఎంచుకునే కోర్సుల విషయంలో స్పష్టతతో ఉండడం ఎంతో ముఖ్యం. ఏ రంగంలో ఉన్నత విద్య ఆశిస్తున్నారో నిర్ణయించుకుని తమ ఆసక్తి, ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి.ఇంటర్ తర్వాత(Best Degree Courses)తీసుకునే నిర్ణయమే వృత్తి జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఎంచుకోవడానికి ఎన్నో దారులు ఉన్నా.. ఏ దారి అయితే మీకు సరిపోతుందో పరిశీలించి ఆ రంగాన్ని ఎంచుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

Best Courses for After 12th Class :ఇంటర్​లో కోర్సులపై పూర్తి అవగాహన లేకుండా ఎంపీసీ, బైపీసీ గ్రూపులు తీసుకుని నానా ఇబ్బందులు ఎదుర్కొని చదివిన వారు.. ఆ తర్వాత మరో మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఎంపీసీ, బైపీసీల్లో భవిష్యత్తును ఆశించేవారికి మేటి కోర్సులెన్నో ఉన్నాయి. అలాగే ఈ సైన్స్‌ గ్రూపుల(Science Groups)ను వదిలించుకోవాలనుకునేవారు రాణించడానికి అవకాశమున్న చదువుల సంఖ్యా తక్కువేం కాదు. అందువల్ల.. ఏదీ తక్కువ కాదు. ఏదీ తక్కువ కాదు. పూర్తిస్థాయిలో సమీక్షించుకుని తమ కెరియర్‌ లైఫ్‌ నిర్మించుకోవాలి.

ఇంటర్ తర్వాత విద్యార్థులు ఎంచుకోవాల్సిన ఉత్తమ మార్గాలిలా..

ఎంపీసీ చదివితే ఆ తర్వాత ఎంచుకునే అవకాశం ఉన్న కోర్సులు : బీఈ/ బీటెక్‌/ బీఆర్క్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీఎస్సీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ (ఆర్మీ/ నేవీ), పైలట్‌, ఎన్‌డీఏ (నేవీ, ఎయిర్‌ఫోర్స్‌)

బైపీసీ చదివితే తర్వాత ఎంచుకునే అవకాశం ఉన్న కోర్సులు : మెడిసిన్‌ (ఎంబీబీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీడీఎస్‌...), వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ. బీఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌/ ఫ్లోరికల్చర్‌. బీఎస్సీ నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్‌, బీఎస్‌-ఎంఎస్‌. బీఎస్సీ రెగ్యులర్‌, బీఎస్సీ- ఫారెస్ట్రీ/ ఫిషరీ సైన్స్‌/ న్యూట్రిషన్‌/ హోం సైన్స్‌. ఆప్టోమెట్రీ

ఎంపీసీ, బైపీసీ ఇద్దరికీ ఎంచుకునే అవకాశం ఉన్న కోర్సులు : బీఫార్మసీ, ఫార్మ్‌డీ..

ఇంటర్మీడియట్ తర్వాత అన్ని గ్రూపులవారికీ (ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ) అవకాశం ఉన్న కోర్సులు : లిబరల్‌ స్టడీస్‌, లా, డీఎడ్‌, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌, సీఏ, సీఎంఏ, సీఎస్‌. హోటల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ, టూరిజం, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంబీఏ, బీబీఎం, బీబీఏ, బీసీఏ, బీఏ, బీఎస్‌డబ్ల్యూ. ఫైన్‌ ఆర్ట్స్‌, విదేశీ భాషలు, ఎయిర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లయిట్‌ స్టివార్డ్‌, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కోర్సులు, డిజైన్‌, ఫ్యాషన్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు, వొకేషనల్‌ కోర్సులు, ఆఫ్‌ బీట్‌ కోర్సులు, ఏఎన్‌ఎం, ఎన్‌డీఏ (ఆర్మీ)

Board Exam New Rules 2023 : ఇకపై ఏడాదికి 2సార్లు బోర్డ్​ ఎగ్జామ్స్​.. ఇంటర్​లో రెండు లాంగ్వేెజెస్​ నేర్చుకోవాల్సిందే!

అన్ని గ్రూపుల వారికీ అవకాశం ఉన్న మరికొన్ని కోర్సుల వివరాలిలా..

టీచింగ్‌ ఫీల్డ్ :ఇంటర్ తర్వాత అన్ని గ్రూపుల విద్యార్థులూ టీచింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు. అయితే.. వీరు డీఎడ్‌ చదవడానికి డైట్‌ సెట్‌ రాయాలి. అందులో ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. అప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో పలు డైట్‌లు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్న విద్యార్థులు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ అనంతరం నాలుగేళ్ల వ్యవధితో వివిధ సంస్థలు అందిస్తోన్న బీఏఎడ్‌, బీఎస్సీ ఎడ్‌ కోర్సులనూ చదువుకోవచ్చు.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు :ఇంటర్‌ విద్యార్హతతో బీఎడ్‌, ఎంఏ, ఎంబీఏ... మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదువుకోవచ్చు. ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా పలు సంస్థలు అందించే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో చేరిపోవచ్చు.

ఫైన్‌ ఆర్ట్స్‌ : ఇంటర్‌ తర్వాత ప్రత్యేక అభిరుచులు ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ బాట పట్టవచ్చు. ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌, యానిమేషన్‌, అప్లైడ్‌ ఆర్ట్స్‌, స్కల్ప్‌చర్‌... మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటికోసమే ప్రత్యేకంగా ఏపీ, తెలంగాణల్లో ఆర్ట్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో పైన పేర్కొన్న కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా పలు యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఈ కోర్సులు ఉన్నాయి. జాతీయ స్థాయిలోనూ పలు సంస్థలు ఫైన్‌ఆర్ట్స్‌ అందిస్తున్నాయి.

న్యాయవిద్యలో అవకాశాలు :న్యాయవిద్య లక్ష్యమైనవారు ఇంటర్మీడియట్ అర్హతతో ముందుకెళ్లవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి పలు మార్గాలు ఉన్నాయి. రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లోకి లాసెట్‌, జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల్లోకి క్లాట్‌, ప్రైవేటు సంస్థల్లోకి ఎల్‌శాట్‌.. మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిద్వారా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరిపోవచ్చు.

డిజైనింగ్ రంగంలో : ఇంటర్‌ అర్హతతో ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు ఉన్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా ముఖ్యమైందే. ఐఐటీ బాంబే, గువాహటితోపాటు పలు సంస్థలు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు.

Best Time Table for Every Student : బెస్ట్ 'టైమ్ టేబుల్' ఫిక్స్ చేయండిలా.. టార్గెట్ పగిలిపోవాలంతే..!

హోటల్ మేనేజ్​మెంట్ రంగంలో :హోటల్ మేనేజ్​మెంట్ రంగంలో అభిరుచి ఉన్నవారు, ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవారు, నిర్వహణ నైపుణ్యం ఉన్నవారు, క్రమపద్ధతిలో సర్దడాన్ని ఇష్టపడేవారు... వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అయితే జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ కలినరీ ఆర్ట్స్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత ఏ గ్రూప్‌ విద్యార్థులైనా వీటిని చదువుకోవచ్చు. ఇందులో పరీక్షలో చూపిన ప్రతిభ లేదా మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి.

విదేశీ భాషలు నేర్చుకోవచ్చు : ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. అన్ని రంగాలు, విభాగాల్లో ప్రస్తుతం విదేశీ భాషలు వచ్చినవాళ్లకు ప్రాధాన్యం పెరిగింది. జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌... ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇఫ్లూతోపాటు పలు విశ్వవిద్యాలయాలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి. వీటిలో పరీక్షతో ప్రవేశాలుంటాయి.

దూరవిద్యలోనూ మంచి అవకాశాలు :ఇంటర్ తర్వాత కాలేజీలకు వెళ్లి డిగ్రీలు చదువుకోవడానికి వీలు లేనివారు దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో అనేక ఓపెన్ స్కూళ్లు, దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి. కాకపోతే లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరడమే శ్రేయస్కరం. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు(ఓపెన్ డిగ్రీ చేసినవారు) దరఖాస్తు చేసుకోవచ్చు.

Grade system in Telangana Intermediate : ఇంటర్‌లోనూ గ్రేడ్లు ఇద్దామా ?

Top Entrance Exams 2024 Schedule : దేశంలో 2024లో జరిగే టాప్ ఎంట్రన్స్​ ఎగ్జామ్స్​ ఇవే.. మీ పరీక్ష ఎప్పుడో చూసుకోండి..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details