సాగు చట్టాల రద్దుతో పాటు రైతుల ఇతర సమస్యలను పరిష్కరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ డిమాండ్ చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్ కిసాన్ మోర్చ(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ (kisan mahapanchayat lucknow) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించిన తర్వాత ప్రభుత్వం రైతులతో చర్చించాలనుకోవట్లేదు. చట్టాల రద్దుతోపాటు మాతో చర్చలు జరిపి మిగిలిన డిమాండ్లను నెరవేరిస్తేనే మేము గ్రామాలకు తిరిగి వెళ్తాము. ఎమ్ఎస్పీ, విత్తనాలు, కాలుష్య సమస్యలు కూడా పరిష్కరించాలి."
- రాకేశ్ టికాయిత్, రైతు ఉద్యమ నాయకుడు