రహస్యంగా ఓ యువతి వీడియోలు తీసి వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది. నిరంజన్ అనే వ్యక్తి 4 ఏళ్ల నుంచి హెచ్ఎస్ఆర్ లే అవుట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాడు. అతడు డ్రగ్స్, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ యువతిపై కన్నేశాడు. ఆమె బాత్రూంలో రహస్య కెమెరా పెట్టి.. నగ్న వీడియోలు చిత్రీకరించాడు.
అనంతరం తన నంబర్ తెలియకుండా ఫారిన్ నంబర్‌తో మెసెజ్‌లు, కాల్స్ చేసే ఓ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ ఫారిన్ నంబర్ నుంచి యువతికి ఆ వీడియోలు పంపించాడు. తనతో శృంగారంలో పాల్గొనకపోతే యువతి నగ్న వీడియోలు పోర్న్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడి ఫోన్లో మరో మూడు వీడియోలు లభించాయి. ఇలా.. నిందితుడు ఇంకెవరినైనా బ్లాక్మెయిల్ చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
అబార్షన్ మందులతో మైనర్ మృతి..
ఓ మైనర్ గర్భవతి మరణానికి కారణమైన వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్డు తీర్పు వెలువరించింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. పెంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఒక బాలిక నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. బాలికను ప్రేమిస్తున్నాని చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కాగా, విషయం బయటపడకుండా ఉండేందుకు అబార్షన్ అయ్యే మందులను 5 నెలల గర్భంతో ఉన్న బాలికకు ఇవ్వగా.. బాలిక చనిపోయింది.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక వివరాలను సేకరించారు. బాలిక చనిపోయే నాటికి ఆమె వయసు 15 ఏళ్ల 9 నెలలుగా ఉందని నిర్ధరించారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు మార్చి.. నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు.. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ. 1000 జరిమానా విధించింది. అయితే, నిందితుడు బాలికను చంపాలనే ఉద్దేశంతో ఆ మందులు ఇవ్వలేదని.. గర్భవిచ్ఛిత్తి చేయడానికి మాత్రమే ఇచ్చాడని వ్యాఖ్యానించింది.