తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోటల్​కు పిలిచి మహిళపై అత్యాచారం చేసిన వ్యాపారి - Bengaluru latest news

వ్యాపార విషయమై చర్చిద్దామంటూ ఫైవ్​ స్టార్​ హోటల్​కు పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యాపారవేత్త. ఈ దారుణ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.

businessman raped a woman
businessman raped a woman

By

Published : Aug 13, 2022, 2:39 PM IST

కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్త.. వ్యాపార విషయమై చర్చిద్దామంటూ పిలిచి.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 6న జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

రమేశ్​ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్తకు బాధితురాలితో చిన్ననాటి నుంచే పరిచయం ఉంది. బాధితురాలు వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే వ్యాపార విషయమై చర్చిద్దామంటూ ఆగస్టు 6న నగరంలోని ఓ ఫైవ్​ స్టార్ హోటల్​కు పిలిచాడు. బాధితురాలు నమ్మి వెళ్లగా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట పెడితే చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం నిందితుడు రమేశ్​.. తమిళనాడుకు పారిపోయాడు. ఆ తర్వాత ఆగస్టు 10న కబ్బన్​ పార్క్​ పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details