Girl Commits Suicide: సాధారణంగా తల్లిదండ్రులు బయటకు వెళ్తున్న సమయంలో ఇంట్లో ఉండే పిల్లలు తమను వారి వెంట తీసుకొని వెళ్లమని గొడవ చేస్తుంటారు. తల్లిదండ్రులు వారికి ఏదో ఒకటి సర్ది చెప్పి వెళ్లిపోతుంటారు. ఈ ఇంట్లోనూ అదే జరిగింది కానీ దానికి పరిణామం ఆ బిడ్డ తనువు చాలించడం.
తనను షాపింగ్‌కు వెంట తీసుకెళ్లలేదని ఐదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక బెంగుళూరులోని చామరాజపేటలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చామరాజనగర్‌లో నివాసముంటున్న ఓ కుటుంబం పండగ సందర్భంగా తమ పిల్లల కోసం షాపింగ్ చేయాలనుకున్నారు. రెండు రోజుల క్రితమే పెద్ద కుమార్తె వైశాలి కోసం డ్రెస్ కొనుక్కుని వచ్చారు. శనివారం మిగతా ఇద్దరు పిల్లల కోసం షాపింగ్ చేయడానికి బయలుదేరారు. తాను వస్తానని వైశాలి పట్టుబట్టడంతో వారు ఆమెకు నచ్చజెప్పి మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైశాలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. తల్లిదండ్రులు చామరాజనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.