'బెంగళూరు టెక్ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సదస్సును కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ఇన్నోవేషన్ టెక్నాలజీ సొసైటీ, రాష్ట్ర విజన్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈసారి సదస్సుకు 'నెక్స్ట్ ఈజ్ నౌ’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. కరోనా అనంతరం మానవాళికి ఎదురయ్యే సవాళ్లు.. ఐటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.
'బెంగళూరు టెక్ సదస్సు'ను ప్రారంభించనున్న మోదీ
కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న 'బెంగళూరు టెక్ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో కరోనా అనంతరం మానవాళికి ఎదురయ్యే సవాళ్లు, ఐటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలపై చర్చించనున్నారు.
'బెంగళూరు టెక్ సదస్సు-2020'ను ప్రారంభించనున్న ప్రధాని
ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, స్విజర్లాండ్ ఉపాధ్యక్షుడు గైపర్మెలిన్తో పాటు, అంతర్జాతీయ స్థాయి ప్రముఖలు పాల్గొననున్నారు. వీరితో పాటు, దేశ విదేశాల్లోని పారిశ్రామిక ప్రముఖులు, టెక్నోక్రాట్స్, పరిశోధకులు, విద్యారంగ నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.