కర్ణాటక బెంగళూరులోని నేలమంగళలో దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి తండ్రిని అత్యంత క్రూరంగా నడిరోడ్డుపై రాడ్లతో కొట్టి చంపాడు నరేశ్ అనే యువకుడు.
తన ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో చెప్పేందుకు ప్రయత్నించగా.. ప్రియురాలి తండ్రి నాగప్ప అడ్డు చెప్పడం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి కుమార్తెను కొద్ది రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తుండే వాడని పేర్కొన్నారు. నాగప్ప స్వస్థలం బళ్లారిలోని సిరుగుప్ప తాలుకా.
ఇదీ జరిగింది..
నరేశ్ కొద్ది రోజులుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ యువతికి అబ్బాయిపై అలాంటి ఆలోచన లేదు. అయితే ఈ ప్రేమ వ్యవహారాన్ని అమ్మాయి తండ్రికి చెప్పి ఒప్పించుకోవాలనే ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే నాగప్ప ఇంటికి వెళ్లాడు. విషయం విన్న నాగప్ప అతని ప్రేమకు నిరాకరించారు. దీంతో తరువాతి రోజు ఉదయం బాధితుడు డ్యూటీకి వెళ్లే సమయంలో మాటు వేసిన నరేశ్, అతని స్నేహితుడు.. ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేశారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు... కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:పెళ్లికి పిలవలేదని వరుడ్ని చితకబాదిన స్నేహితుడు