తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంగ్లీష్​ ఇరగదీస్తున్న చెత్త ఏరుకునే వృద్ధురాలు

చెత్త ఏరుకుని జీవనం సాగించే వారంటేనే సమాజంలో చాలా చిన్నచూపు ఉంటుంది. వారితో మాట్లాడేందుకు ఎవరూ సాహసం చేయరు. కానీ, ఓ వృద్ధురాలిని పలకరించగా.. తన ఆంగ్ల భాషా నైపుణ్యంతో ఆశ్చర్యానికి గురిచేసింది.

Bengaluru ragpicker's English speaking skills
సిసిలియా మార్గరెట్ లారెన్స్

By

Published : Aug 19, 2021, 12:12 PM IST

చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే ఓ వృద్ధురాలు తన ఇంగ్లీష్​తో ఇంటర్​నెట్​ను ఊపేస్తోంది. బెంగళూరులో ఉండే ఆ వృద్ధురాలికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ మహిళ మాట్లాడుతున్న ఇంగ్లీష్​ చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు నెటిజన్లు.

సిసిలియా మార్గరెట్ లారెన్స్

సిసిలియా మార్గరెట్ లారెన్స్​ అనే వృద్ధురాలు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు సచినా హెగ్గర్​ అనే నెటిజెన్​. 'కథలు ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఆగి, చుట్టూ చూడటమే. కొన్ని అందమైనవి, మరికొన్ని బాధాకరమైనవి కనిపిస్తాయి.' అని రాసుకొచ్చారు హెగ్గర్​.

ఆమె గురించి అడగగా.. తాను ఓ చర్చిని శుభ్రం చేస్తానని, ప్లాస్టిక్​ వస్తువులను సేకరించి అమ్ముకుంటూ జీవిస్తానని చెప్పినట్లు తెలిపారు.

వీడియోలో.. తన జీవితంలో జరిగిన పరిణామాలను వివరించింది వృద్ధురాలు. తాను 2007-14 వరకు ఏడేళ్ల పాటు జపాన్​లో నివసించినట్లు చెప్పుకొచ్చింది. ఓ పాట కూడా పాడి వినిపించింది.

ఇదీ చూడండి:ఒకప్పుడు ఐఐటీ ఇంజినీర్​.. ఇప్పుడు యాచకుడు

ABOUT THE AUTHOR

...view details