తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈ ఘరానా దొంగపై 80 కేసులు.. 17వ సారి అరెస్టు

Bengaluru Notorious robber Arrest: 80 కేసుల్లో నిందితునిగా ఉన్న ఓ ఘరానా దొంగను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.11.43 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేయడం ఇది 17వ సారి కావడం గమనార్హం.

burglar
దొంగ

By

Published : Jan 2, 2022, 11:00 AM IST

Updated : Jan 2, 2022, 12:26 PM IST

Bengaluru Notorious robber Arrest: జేబుదొంగ పాత్రలను సినిమాల్లో చూసి ఉంటాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాకచక్యంగా దొంగతనం చేస్తుంటారు పాత్రధారులు. పోలీసుల అరెస్టులు, బెయిల్​పై విడుదలై మళ్లీ అదే పనిగా దొంగతనం చేయడం.. అదో వృత్తిగా భావిస్తారు. ఇలాంటి పాత్రల నుంచి స్ఫూర్తి పొందాడో ఏమో.. కర్ణాటక, బెంగళూరుకు చెందిన ఓ దొంగ నిజజీవితంలో అచ్చం అలానే మారిపోయాడు. 80 కేసుల్లో నిందితునిగా ఉన్న అతన్ని బెంగళూరు పోలీసులు శనివారం పట్టుకున్నారు. అతడ్ని అరెస్టు చేయడం ఇది 17వసారి కావడం గమనార్హం.

Escape Karthik Arrest in Bengaluru: నిందితున్ని కార్తిక్ కుమార్​గా పోలీసులు తెలిపారు. నిందితుడు 2005లో 16వ ఏట మొదటిసారి దొంగతనం చేశాడని చెప్పారు. అప్పటి నుంచి వరుస దొంగతనాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. రెండుసార్లు కస్టడీ నుంచి కూడా తప్పించుకుని 'ఎస్కేప్​ కార్తిక్'​గా చలామణి అవుతున్నాడని వెల్లడించారు.

నిందితుని నుంచి రూ.11.43 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసు.

ఇదీ చదవండి:మేకల్ని దొంగలించిన పోలీస్- న్యూఇయర్ పార్టీ కోసం..

Last Updated : Jan 2, 2022, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details