ప్రియురాలితో బ్రేకప్‌ను తట్టుకోలేకపోయిన ఓ యువకుడు (27).. ఆ కోపాన్ని వీధుల్లో ఉంచిన కార్లపై చూపించాడు. ఏకంగా 15 కార్లను ధ్వంసం చేశాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని పశ్చిమ జోన్‌లో గురువారం రాత్రి జరిగింది.
ప్రియురాలితో బ్రేకప్ అయితే ఇలా కూడా చేస్తారా? - car vandalism
ప్రియురాలితో బ్రేకప్ అయితే కొందరు మందేస్తారు. మరికొందరు బాధతో కుంగిపోతారు. కానీ, బెంగళూరులో ఓ ప్రేమికుడు సైకోలా ప్రవర్తించాడు. అతడు ఏం చేశాడంటే...
రాత్రి వరకు బాగానే ఉన్న తమ కార్లు ఉదయం లేచేసరికి ధ్వంసమై కనిపించడంతో ఆ వాహనాల యజమానులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. వీధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు.. ఓ యువకుడు కార్లను రాడ్డుతో ధ్వంసం చేసినట్లు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. కాగా ప్రియురాలితో బ్రేకప్ కారణంగా తీవ్ర కుంగుబాటు, మనోవేదనకు గురై.. కోపంతో ఈ పనిచేసినట్లు సదరు యువకుడు పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఇదీ చదవండి:శీర్షాసనంలో మ్యాజిక్‌తో జాతీయ రికార్డ్