భర్త కొడుతున్నాడని భార్య ఫిర్యాదు చేయడం చాలాసార్లు చూసుంటాం. కానీ కర్ణాటకలో మాత్రం సీన్ రివర్స్. భార్య తనను వేధిస్తోందని ఓ భర్త వాపోయాడు. ఈ విషయమై ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పీఎంఓను, న్యాయయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ట్యాగ్ చేస్తూ.. తన బాధను వెళ్లగక్కాడు. స్పందించిన కమిషనర్ అతనికి సహాయం చేస్తానని తెలిపారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు.. ఆ వ్యక్తికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
నారీ శక్తి అంటే ఇదేనా?
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య అనే ఓ వ్యక్తి తన భార్యపై పీఎంఓకు ఫిర్యాదు చేశాడు. ఆమె తరచూ తనను వేధిస్తోందని.. తనపై చేయి చేసుకుంటోందని ట్విట్టర్లో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆమె వల్ల తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆమె తనను కత్తితో గాయపరించిందని ఆరోపించాడు.