తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మిత్రులతో ఆ పని చేయాలని భార్యను వేధించి... - భార్య-భర్త గొడవ

సొంత భార్యపై క్రూరంగా ప్రవర్తించాడు ఓ భర్త. తొలుత మద్యం తాగాలని ఒత్తిడి చేసి.. తర్వాత తన మిత్రులతో శృంగారంలో పాల్గొనాలని వేధించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది.

husband torcher
భర్త వేధింపులు, సైకో భర్త

By

Published : Jun 10, 2021, 10:28 AM IST

Updated : Jun 10, 2021, 11:09 AM IST

మిత్రులతో శృంగారంలో పాల్గొనాలని సొంత భార్యనే వేధించాడు ఓ కిరాతక భర్త. అంతేకాకుండా.. పుట్టిన బిడ్డ కళ్లు నీలి రంగులో ఉన్నాయని భార్య, బిడ్డను వదిలేశాడు. ఈ ఘటన కర్ణాటక బెంగళూరులో జరిగింది.

రెండు సార్లు అబార్షన్​..

బెంగళూరు బీటీఎమ్​ లేఅవుట్​కు చెందిన వసీమ్ షరీఫ్​కు.. . బనశంకరికి చెందిన ఓ యువతితో 2018లో వివాహం జరిగింది. కొన్ని రోజుల తర్వాత తన భార్యను గోవాకు తీసుకెళ్లాడు షరీఫ్. మద్యం సేవించాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు నిరాకరించిన తన భార్యను శారీరకంగా వేధించి బెంగళూరుకు తీసుకువచ్చాడు.

భార్యతో షరీఫ్

తర్వాత.. పార్టీ పేరుతో మిత్రులను తన ఇంటికి పిలవడం మొదలుపెట్టాడు షరీఫ్. తన మిత్రులకు డ్రింక్స్ సర్వ్ చేయాలని, వారితో శృంగారంలో పాల్గొనాలని సొంత భార్యను ఒత్తిడి చేశాడు. రెండుసార్లు బలవంతంగా అబార్షన్​ చేయించాడు. మూడోసారి కూడా అబార్షన్​ చేయించేందుకు ప్రయత్నించగా.. తన భార్య నిరాకరించింది. దీంతో బిడ్డకు నీలి రంగు కళ్లు ఉన్నాయంటూ భార్య, కూతురును బయటికి గెంటేశాడు షరీఫ్.

షరీఫ్

వేధింపులు తాళలేక ఈస్ట్​ వింగ్ మహిళా పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో.. ఫరీష్​ సహా అతని నలుగురు మిత్రులపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇదీ చదవండి:Rape: బాలికపై ఏడుగురు మైనర్లు అత్యాచారం

Last Updated : Jun 10, 2021, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details