తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బెంగళూరు వాసికి జాక్​పాట్​.. లాటరీలో రూ.44 కోట్లు.. ప్రాంక్ అనుకొని నంబర్​ బ్లాక్​.. - లాటరీ గెలుచుకున్న అరుణ్​ కుమార్​

మనకు ఎవరైనా కాల్​ చేసి కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారంటే.. ఏం చేస్తాం? అది ప్రాంక్​ కాల్​గా భావించి వెంటేనే డిస్​కనెక్ట్ చేస్తాం. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇలానే లాటరీ గెలుచుకున్నారని కాల్​ వచ్చింది. దాన్ని ఫేక్​గా భావించిన ఆయన.. ఆ నంబర్​ను బ్లాక్ చేశారు. కానీ, ఆయన నిజంగానే రూ. 44 కోట్ల భారీ లాటరీలో గెలుచుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఆయన ఆ భారీ జాక్​పాట్​ను ఎలా దక్కించుకున్నారంటే?

bengaluru man wins lottery
bengaluru man wins lottery

By

Published : Apr 5, 2023, 6:23 PM IST

Updated : Apr 5, 2023, 6:49 PM IST

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. ఒక్క రోజులోనే ఆయన కోటీశ్వరుడు అయ్యారు. ఆన్​లైన్​లో కొనుగోలు చేసిన టికెట్​తో.. ఏకంగా రూ.44 కోట్లు గెలుచుకున్నారు. బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వటక్కే కొరోత్ అనే వ్యక్తి ఈ బంపర్ జాక్‍పాట్ కొట్టారు. అయితే అరుణ్​ కుమార్​కు లాటరీ గెలుచుకున్నారని ఫోన్​ వస్తే దాన్ని ఆయన ప్రాంక్ కాల్ అనుకుని ఆ నంబర్​ను బ్లాక్​ చేశారు.

అరుణ్​ కుమార్​ వటక్కే కొరోత్​.. ఆన్​లైన్​లో అబుదాబీకి చెందిన లాటరీ టికెట్​ను కొనుగోలు చేశారు. మార్చి 22వ తేదీన అరుణ్​ కుమార్​ బిగ్ టికెట్ డ్రా సిరీస్ 250లో ఓ లాటరీ టికెట్​ను కొన్నారు. అయితే ఏప్రిల్​ 3వ తేదీన లైవ్​ షోలో లక్కీ డ్రా ద్వారా లాటరీ విజేతను ప్రకటించారు. అదృష్టవశాత్తూ అరుణ్​ కుమార్​ ఆ లక్కీ డ్రాలో మొదటి విజేతగా నిలిచారు. ఫలితంగా అరుణ్​ కుమార్​కు అబుదాబీలో 20 మిలియన్​ దిర్హమ్​ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.44 కోట్లు దక్కాయి.

ప్రాంక్ కాల్ అనుకున్నాడట..
అరుణ్ కుమార్‍ ఆన్​లైన్​లో కొనుగోలు చేసిన బిగ్​ లాటరీ టికెట్​కు బంపర్​ ప్రైజ్​ వచ్చిందని.. బిగ్ టికెట్ లైవ్ డ్రా హోస్ట్ ఆయనకు కాల్ చేశారు. బిగ్​ లాటరీలో మొదటి బహుమతి గెలుపొందారన్న విషయాన్ని అరుణ్​కు తెలిపారు. అయితే అరుణ్​ కుమార్​ దీన్ని ప్రాంక్ కాల్ అని అనుకున్నారు. వెంటనే ఫోన్ కట్ చేసి.. ఆ నంబర్‌ను బ్లాక్ చేశారు. అయితే హోస్ట్​లు మరో నంబర్ ద్వారా కాల్​ చేసి చెప్పిన తర్వాతే ఆ విషయాన్ని నమ్మారు అరుణ్.

"బిగ్ టికెట్ నుంచి కాల్ వచ్చినప్పుడు మొదట నేను అది ఫేక్​ కాల్​ అనుకున్నా. ఎవరైనా ప్రాంక్ కాల్​ చేసి ఉండొచ్చని భావించా. నేను ఆ కాల్ డిస్‍కనెక్ట్ చేసి.. ఆ నంబర్‌ను బ్లాక్ చేశాను. వెంటనే వేరే నంబర్‌ నుంచి నాకు కాల్ వచ్చింది" అని అరుణ్​ కుమార్​ తెలిపారు. రెండోసారి ఫోన్​ కాల్​ వచ్చిన తర్వాతనే అరుణ్​ తనకు లాటరీలో మొదటి ప్రైజ్​ వచ్చిందన్న విషయాన్ని నమ్మారు. తాను లాటరీ టికెట్​ కొనుగోలు చేయడం రెండవసారి అని అరుణ్​ వెల్లడించారు.

రూ.6,536 జాక్​పాట్ కొట్టిన వ్యక్తి!
ఇటీవలే అమెరికాకు చెందిన ఏ వక్తి ఓ వ్యక్తి ఏకంగా రూ.6,536 కోట్లకు పైగా సొమ్మును లాటరీలో గెలుచుకున్నారు. అమెరికా కరెన్సీలో దీని విలువ 754.6 మిలియన్ల డాలర్లు. పవర్‌బాల్ లాటరీ గేమ్​లో ఈ భారీ జాక్​పాట్​ను ఆయన సొంతం చేసుకున్నారు. అయితే జాక్‌పాట్​ నగదు మొత్తాన్ని విజేతకు ఒకేసారి ఇవ్వరు. విడతలవారీగా అందిస్తారు. తొలుత మొత్తం లాటరీ ప్రైజ్​ మనీలో కొంతభాగం ఇచ్చేస్తారు. మిగిలిన మొత్తాన్ని గెలిచిన సమయం నుంచి 29 సంవత్సరాల వరకు దశలవారీగా చెల్లిస్తారు. గెలుచుకున్న మొత్తానికి సంవత్సరానికి 5 శాతం చొప్పున వడ్డీని కలుపుతారు. అయితే విజేత ఇందుకు అంగీకరించపోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 5, 2023, 6:49 PM IST

ABOUT THE AUTHOR

...view details