తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చికెన్​ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!

చికెన్ ఫ్రై రుచిగా వండలేదని కట్టుకున్న భార్యను చంపాడు ఓ కిరాతకుడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని చెరువులో పడేశాడు. అత్తామామలకు మాత్రం.. తనతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని కట్టుకథ చెప్పాడు.

Husband kills wife
భార్యను చంపిన భర్త

By

Published : Aug 24, 2021, 12:45 PM IST

చికెన్​ ఫ్రై సరిగా చేయలేదని.. భార్యను చంపిన దారణమైన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

ఏం జరిగిందంటే?

షిరిన్​ బాను(25), ముబారక్(32) దంపతులు. ముబారక్​ ఓ వ్యాపారి. బెంగళూరు సొలదేహనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తరబనహళ్లిలో రెండేళ్లుగా నివాసం ఉంటున్నారు. వంట సరిగా చేయటం లేదని ముబారక్ నిత్యం షిరిన్​తో గొడవపడేవాడు. తన భర్త వేధింపులు పడలేక.. ఇదే విషయాన్ని పలుమార్లు తన తల్లిదండ్రులతో చెప్పింది షిరిన్. ఇటీవల రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు.. ఇద్దరికీ నచ్చజెప్పారు.

అయితే తాజాగా.. ముబారక్, షిరీన్​ను చికెన్​ఫ్రై చేయమన్నాడు. అది రుచిగా చేయలేదన్న కోపంతో షిరిన్​ను దూషించి.. చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని చెరువులో పడేశాడు.

కట్టుకథ అల్లి..

తనతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని షిరిన్​ తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు ముబారక్. అల్లుడి ప్రవర్తనపై అనుమానం కలిగిన షిరిన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురు 18 రోజులుగా ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భాగంగా ముబారక్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. విచారణలో.. తానే హత్య చేసినట్లు ముబారక్ ఒప్పుకున్నాడు.

ఇదీ చదవండి:భర్త చికెన్ తిన్నాడని.. భార్య సూసైడ్!

ABOUT THE AUTHOR

...view details