Omicron Reinfection: ఒమిక్రాన్‌ను జయించిన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కొవిడ్ సోకింది. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. అయితే ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.
దేశంలో తొలిసారి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఇద్దరిలో ఈయన కూడా ఒకరు.
పారిపోయిన వ్యక్తిపై కేసు
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిని క్వారెంటైన్లో ఉంచగా.. గుజరాత్‌కు చెందిన వ్యక్తి దుబాయ్‌కు పారిపోయాడు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా.. క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతనిపై పోలీసు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని అనుమతించినందుకు ఓ ఫైవ్‌స్టార్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు.