తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి... - బెంగళూరు రేప్ న్యూస్

Bengaluru Crime News: ప్రపంచం ఆధునికత వైపు దూసుకెళ్తున్నా.. మహిళలపై కొందరు మానవ మృగాల వేధింపులు మాత్రం ఆగడం లేదు. కర్ణాటక బెంగళూరులో మైనర్​పై.. ఓ ఆటోడ్రైవర్​ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

rape
రేప్

By

Published : Jan 24, 2022, 6:43 AM IST

Bengaluru Crime News: కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డాడు 36 ఏళ్ల ఆటోడ్రైవర్. ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేశారు పశ్చిమ బెంగళూరు పోలీసులు.

ఇదీ జరిగింది..

ఆటోడ్రైవర్ అనిల్ కుమార్(36).. బాలిక ఇంటి సమీపంలోనే నివసిస్తుండేవాడు. అయితే.. శనివారం రాత్రి 7.30 గంటలకు బాధితురాలి తల్లి బయటకు వెళ్లింది. అదే అదనుగా భావించి మైనర్​ ఇంట్లోకి ప్రవేశించాడు అనిల్. గుడ్డ ముక్కలతో బాలిక​ను కట్టేసి ఆమెను రేప్ చేశాడు.

కొద్ది సమయం తర్వాత ఇంటికి తిరిగొచ్చిన బాధితురాలి తల్లి.. తీవ్ర గాయాలతో ఉన్న తన కూతురుని చూసి షాక్​ అయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. బాలిక తల్లి ఫిర్యాదుతో.. నందినీ లే అవుట్ పోలీసు స్టేషన్​లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మైనర్​ను మెడికల్ చెకప్​ కోసం ఆసుపత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన అనిల్​ను అరెస్టు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

మహిళపై దంపతుల అత్యాచారం- వీడియో తీసి బ్లాక్​మెయిల్​!

ABOUT THE AUTHOR

...view details