Bangalore Girl Death: కర్ణాటకలోని బెంగళూరులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. యళహంకలోని ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్న ఓ యువతిపై మరో కాలేజ్‌కు చెందిన మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.
కాలేజ్‌లో యువతి దారుణ హత్య.. అక్కడికక్కడే మృతి.. ప్రేమే కారణం! - girl stabbed to death in karnataka
బెంగళూరులోని ఓ కాలేజ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. యువతిపై ఓ యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోలార్ ప్రాంతానికి చెందిన బాధితురాలు.. ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంటెక్ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం బాధితురాలిపై మరో కాలేజీలో చదువుతున్న పవన్ కల్యాణ్ అనే యువకుడు.. కత్తితో దాడి చేశాడు. అనంతరం అతడు కూడా పొడుచుకున్నాడు. విషయం తెలుసుకున్న కళాశాల సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే యువతి మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. పవన్‌ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలిని ఇటీవలే పవన్ ప్రపోజ్ చేయగా.. ఆమె నిరాకరించిందని సమాచారం. అందుకే పవన్ కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలుస్తోంది.