కర్ణాటక బెంగళూరులో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేయసి గొంతు నులిమి హత్య చేశాడు ఓ ప్రియుడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులుకు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు ఇద్దరు సెక్స్‌లో పాల్గొన్నట్లు పోస్టుమార్టం పరీక్షలో తేలింది.
ఇదీ జరిగింది
కేపీ అగ్రహారకు చెందిన మనోజ్.. శాలిని అనే యువతి ఇద్దరూ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కానీ శాలిని ఇటీవలే మరో యువకుడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం శాలిని ఇంటికి వచ్చిన మనోజ్.. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. దీనికి శాలిని ఒప్పుకోకపోవడం వల్ల ఆగ్రహించిన మనోజ్.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అగ్రహరలోని ఇంటికి వచ్చి ఆత్మహత్యకు యత్నించాడు మనోజ్.
శాలిని మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ పోస్టుమార్టం నివేదికలో విస్తుపోయే నిజం బయటపడింది. హత్యకు ముందు ఇద్దరు లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు పోస్టుమార్టం పరీక్షలో తేలింది. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని డీసీపీ శ్రీనివాస గౌడ తెలిపారు. అతడు పూర్తిగా కొలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.